News July 23, 2024

BREAKING: హైకోర్టుకు జగన్

image

AP: మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఆయన పిటిషన్ వేశారు. ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్‌కు లేఖ రాసినా ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష నేతగా జగన్‌కు అర్హత లేదని టీడీపీ చెబుతోంది.

Similar News

News March 27, 2026

భద్రాద్రి రాములోరిని చూడండి..!

image

దక్షిణ అయోధ్య భద్రాద్రి రాములోరి పెళ్లి అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. పెళ్లికొడుకు అలంకరణలో రామయ్య, పెళ్లి కూతురి అలంకరణలో సీతమ్మ భక్తులను కనువిందు చేస్తున్నారు. స్వామి, అమ్మవార్ల రూపాలు భక్తులను కట్టి పడేస్తున్నాయి. భద్రాద్రి పరిసరాలు ‘జై శ్రీరామ్’ నినాదాలతో మార్మోగుతున్నాయి. రామయ్య పెళ్లి వేడుకలో CM దంపతులు, డిప్యూటీ CM దంపతులు సహా మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News March 27, 2026

ఈ తగ్గింపు ఎన్నికల వరకేనా: రాజ్‌దీప్

image

పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంపై భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఎన్నికల(మే 4) వరకేనా లేక కొనసాగుతుందా? అని జర్నలిస్ట్ రాజ్‌దీప్ ప్రశ్నించారు. గతంలో అంతర్జాతీయంగా ధరలు తగ్గినప్పుడు ఆ ప్రయోజనాన్ని ప్రజలకు ఎందుకు చేకూర్చలేదని విమర్శించారు. ఇంధన ధరలు మార్కెట్ పరిస్థితుల కంటే ఎన్నికలపై ఆధారపడ్డాయని ఆయన చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

News March 27, 2026

RCBvsSRH.. ప్లేయింగ్-11 అంచనా ఇదే!

image

క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపేందుకు ఐపీఎల్ సిద్ధమైంది. రేపు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో RCB, SRH తలపడనున్నాయి. ఇరు జట్ల ప్లేయింగ్-11 అంచనా ఇలా ఉంది.
RCB: కోహ్లీ, సాల్ట్, వెంకటేశ్, రజత్, డేవిడ్, జితేశ్, షెఫర్డ్, కృనాల్, భువనేశ్వర్, జాకోబ్, మంగేశ్
SRH: అభిషేక్, హెడ్, కిషన్, క్లాసెన్, లివింగ్‌స్టోన్, నితీశ్, అనికేత్, బ్రైడన్, హర్షల్, శివ్‌నాగ్, జీషన్