News March 24, 2024

జనసేన అభ్యర్థుల జాబితా విడుదల

image

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 18 మంది అభ్యర్థుల జాబితాను జనసేన విడుదల చేసింది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలో ఉంటారని అధికారంగా ప్రకటించింది. నెల్లిమర్ల-లోకం మాధవి, అనకాపల్లి- కొణతాల రామకృష్ణ, కాకినాడ రూరల్-పంతం నానాజీ, తెనాలి-నాదెండ్ల మనోహర్, నిడదవోలు-కందుల దుర్గేష్, పెందుర్తి-పంచకర్ల రమేశ్ బాబు, యలమంచిలి- సుందరపు విజయ్ కుమార్, పి.గన్నవరం-గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు.

Similar News

News October 3, 2024

మండే ఎండలు.. భారీ వర్షాలు

image

APలో విచిత్ర వాతావరణ పరిస్థితి నెలకొంది. ఓవైపు వర్షాలు కురుస్తుండగా మరోవైపు ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. నిన్న నెల్లూరులో 40.7 డిగ్రీలు, కావలిలో 39.8, అనంతపురంలో 38.9, తిరుపతిలో 37.6 అమరావతిలో 36.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా ఇవాళ ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, YSR, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

News October 3, 2024

పెట్రోల్ ధరల పెంపు?

image

పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా క్రూడాయిల్ రేట్లు పెరిగాయి. 71 డాలర్లుగా ఉన్న బ్యారెల్ ముడిచమురు ధర 2.7% పెరిగి 75 డాలర్లకు చేరింది. ప్రపంచంలో మూడో వంతు దేశాలకు ప్రస్తుతం ఇరాన్ నుంచే ఆయిల్ సప్లై అవుతోంది. ముడిచమురు ధరలకు అనుగుణంగానే మన దేశంలోని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పులు చేస్తున్నాయి. ఫలితంగా పెట్రో ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణుల అంచనా.

News October 3, 2024

సన్యాసం స్వీకరించాలని ఎవరినీ అడగం: ఈశా ఫౌండేషన్

image

తమిళనాడు కోయంబత్తూరులోని <<14238933>>ఈశా<<>> యోగా కేంద్రంలో జరుగుతున్న పోలీసు తనిఖీలపై నిర్వాహకులు స్పందించారు. ప్రజలకు యోగా, ఆధ్యాత్మికతను అందించేందుకు సద్గురు ఈశా ఫౌండేషన్‌ను ప్రారంభించారని పేర్కొన్నారు. వివాహం చేసుకోవాలని గానీ, సన్యాసం స్వీకరించాలని గానీ తామెవ్వరినీ అడగమని స్పష్టం చేశారు. కోర్టులో నిజమే గెలుస్తుందన్నారు. నిరాధార ఆరోపణలు చేస్తే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.