News April 25, 2024

BREAKING: జేఈఈ మెయిన్-2 ఫలితాలు విడుదల

image

జేఈఈ మెయిన్‌ సెషన్‌-2 ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. <>https://jeemain.nta.ac.in/<<>> వెబ్‌సైట్‌లో అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి రిజల్ట్స్ తెలుసుకోవచ్చు. అలాగే జనవరిలో జరిగిన తొలి సెషన్‌తోపాటు ఏప్రిల్‌లో నిర్వహించిన రెండో సెషన్‌లో మెరుగైన స్కోరు సాధించిన వారి మెరిట్ లిస్టును విడుదల చేసింది. దేశంలో 2.5 లక్షల మందిని అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేసింది.

Similar News

News December 1, 2025

రష్యాపై ఆంక్షలు.. 17,700 KMs నుంచి ఇండియాకు ఆయిల్

image

రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షల నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై భారత్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో కరీబియన్ దేశం గయానా నుంచి చమురు కొనుగోలు చేస్తోంది. దాదాపు 17,700 కిలోమీటర్ల దూరం నుంచి ఆయిల్ ట్యాంకర్లు వస్తున్నాయి. 2 సూపర్ ట్యాంకర్లు సుదీర్ఘ ప్రయాణం ప్రారంభించాయి. ఒక్కో దాంట్లో 2 మిలియన్ బ్యారెల్స్ చొప్పున ఆయిల్ వస్తోంది. జనవరి నాటికి అవి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది.

News December 1, 2025

ఈ టీకాతో గర్భాశయ క్యాన్సర్‌కు 90% చెక్..!

image

మహిళలకు ప్రాణాంతకమైన గర్భాశయ క్యాన్సర్‌ను నివారించడంలో హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) వ్యాక్సిన్ ప్రభావవంతంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. HPV టీకా తీసుకున్న బాలికల్లో, టీకా తీసుకోని వారితో పోలిస్తే, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 80% నుంచి 90% వరకు గణనీయంగా తగ్గినట్లు తాజా డేటా స్పష్టం చేసింది. టీకా తీసుకున్న తర్వాత 15-20 సంవత్సరాల పాటు రక్షణ ప్రభావం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

News December 1, 2025

చిన్న వయసులోనే టీకా ఎందుకు తీసుకోవాలంటే..?

image

గర్భాశయ క్యాన్సర్‌కు ప్రధాన కారణమైన హ్యూమన్ పాపిల్లోమావైరస్ (HPV) సంక్రమించడానికి ముందే టీకా తీసుకోవడం వల్ల అత్యధిక రక్షణ లభిస్తుంది. అందుకే, లైంగిక చర్య ప్రారంభానికి ముందే, అంటే 9 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సులో బాలికలకు టీకా ఇవ్వాలని వైద్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. బాలికలకే కాకుండా పురుషాంగం, పాయువు, గొంతు క్యాన్సర్ల రక్షణ కోసం బాలురు కూడా ఈ టీకా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.