News July 8, 2024
BREAKING: JL ఫలితాలు విడుదల

TG: జూనియర్ లెక్చరర్స్ పరీక్షల ఫలితాలను TGPSC విడుదల చేసింది. సబ్జెక్టుల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెబ్సైటులో ఉంచింది. 1:2 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ జాబితాను త్వరలోనే వెల్లడిస్తామంది. పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో షార్ట్ లిస్ట్ చేస్తామంది. కాగా గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లోనే జేఎల్ పరీక్షలు జరిగాయి. ఫలితాల కోసం ఇక్కడ <
Similar News
News October 20, 2025
దీపావళి: ఈ నియమాలు పాటిస్తున్నారా?

దీపావళి రోజున చేసే లక్ష్మీదేవి పూజలో ఇనుప వస్తువులు వాడకూడదని పండితులు సూచిస్తున్నారు. ఇది నెగటివ్ శక్తిని పెంచుతుందని అంటున్నారు. ‘నేడు ఉల్లి, వెల్లుల్లి, గుడ్లు, మాంసం, మద్యానికి దూరంగా ఉండాలి. ఇంట్లో ఆడవారిని ఎట్టి పరిస్థితుల్లో బాధపెట్టకూడదు. ఈ రోజున ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకూడదు. ఇంట్లో బూజు దులపకూడదు. తులసి ఆకులు కోయకూడదు. ఇలా ఇస్తే.. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్తుంది’ అని చెబుతున్నారు.
News October 20, 2025
తిరుమలలో భక్తుల రద్దీ.. ఆర్జిత సేవలు రద్దు

AP: దీపావళి పండుగ వేళ తిరుమలలో రద్దీ నెలకొంది. 30 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల వరకు సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 84,017 మంది దర్శించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.4.97 కోట్ల ఆదాయం వచ్చింది. కాగా ఇవాళ శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆర్జిత సేవలు రద్దు చేశారు.
News October 20, 2025
NIT సూరత్‌లో 23 పోస్టులు

సర్దార్ వల్లభాయ్ NIT, సూరత్(SVNIT) 23 పోస్టులకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. వీటిలో Jr, Sr అసిస్టెంట్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, స్పోర్ట్స్ ఆఫీసర్, Asst లైబ్రేరియన్, సూపరింటెండెంట్, Jr ఇంజినీర్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. సరైన అర్హతలుగల వారు NOV 14వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని NOV 21లోగా స్పీడ్ పోస్టు ద్వారా పంపించాలి. వెబ్సైట్: https://www.svnit.ac.in