News March 31, 2024
BREAKING: కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి

TG: రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌లో చేరారు. తన కూతురు కావ్యతో కలిసి ఆయన సీఎం రేవంత్ రెడ్డి, దీపాదాస్ మున్షీ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్నారు. నిన్న హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్‌లో చేరగా.. ఆమె తండ్రి, సీనియర్ నేత కె.కేశవరావు త్వరలోనే ఆ పార్టీలోకి వెళ్లనున్నారు.
Similar News
News January 30, 2026
సూపర్ సెంచరీ.. 49 బంతుల్లో 115 రన్స్

సెంచూరియన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 43 బంతుల్లోనే సెంచరీ చేశారు. 10 సిక్సులు, 6 ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. డికాక్ (49 బంతుల్లో 115), రికెల్టన్ (36 బంతుల్లో 77*) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో WI నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని SA 17.3 ఓవర్లలోనే ఛేదించింది. WI బ్యాటర్లలో హెట్‌మయర్ (42 బంతుల్లో 75), రూథర్ ఫర్డ్ (24 బంతుల్లో 57) రాణించారు.
News January 30, 2026
జనవరి 30: చరిత్రలో ఈ రోజు

* 1882: US మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్ట్ జననం
* 1933: జర్మనీకి వైస్ ఛాన్స్‌లర్‌గా అడాల్ఫ్ హిట్లర్ నియామకం
* 1957: సినీ దర్శకుడు ప్రియదర్శన్ జననం
* 1948: భారత జాతి పిత మహాత్మా గాంధీ మరణం
* 2016: తెలుగు రచయిత్రి నాయని కృష్ణకుమారి మరణం
* 2016: భారత సైనిక దళాల మాజీ ఛీఫ్ జనరల్ కేవీ కృష్ణారావు మరణం
* అమరవీరుల సంస్మరణ దినం
News January 30, 2026
అల్లు అర్జున్-లోకేశ్ సినిమాలో శ్రద్ధా కపూర్?

తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించే అవకాశం ఉందని సినీవర్గాలు వెల్లడించాయి. డైరెక్టర్ ఆమెను సంప్రదించి స్టోరీ వినిపించినట్లు పేర్కొన్నాయి. దీనిపై మూవీ టీమ్ నుంచి ప్రకటన రావాల్సి ఉంది. కాగా బన్ని ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో ఓ సినిమా చేస్తున్నారు. అందులో దీపికా పదుకొనె నటిస్తున్నారు.


