News March 23, 2024
BREAKING: కవిత కస్టడీ పొడిగింపు

లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. మళ్లీ 26వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఆమెను కోర్టులో హాజరుపర్చాలని అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు. కాగా ఈ 3 రోజులు అరవింద్ కేజ్రీవాల్‌తో కలిపి కవితను ఈడీ విచారించే అవకాశం ఉంది.
Similar News
News April 20, 2025
అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్ నోటిఫికేషన్ విడుదల

అగ్నివీర్ ఎయిర్‌ఫోర్స్(మ్యూజిషియన్స్) పోస్టులకు <
వెబ్సైట్:https://agnipathvayu.cdac.in/
News April 20, 2025
హసీనా అరెస్టుకు ఇంటర్‌పోల్ సాయం కోరిన బంగ్లా

బంగ్లాదేశ్ మాజీ పీఎం షేక్ హసీనా సహా 12 మందిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని ఆ దేశ పోలీసులు ఇంటర్‌పోల్‌ను కోరారు. బంగ్లా చీఫ్ అడ్వైజర్‌గా యూనస్ బాధ్యతలు చేపట్టాక హసీనాతో పాటు మాజీ మంత్రులు, ఆర్మీ అధికారులపై అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఇంటర్‌పోల్ రెడ్ నోటీస్ ఇస్తే ఆ వ్యక్తులు ఏ దేశంలో ఉన్నా అరెస్ట్ చేసేందుకు వీలవుతుంది. కాగా హసీనా గతేడాది AUG 5 నుంచి భారత్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే.
News April 20, 2025
ధోనీ పరిస్థితులను తలకిందులు చేయగలడు: రోహిత్

ధోనీ సామర్థ్యం, అనుభవాన్ని రోహిత్ కొనియాడారు. ధోనీతో అంత ఈజీ కాదని చెప్పారు. ‘మహీ ఎన్నో మ్యాచులకు కెప్టెన్‌గా చేశారు. ఎన్నో ట్రోఫీస్ గెలిపించారు. అలాంటి వ్యక్తి ప్రత్యర్థిగా ఉంటే మనం రిలాక్స్ అవ్వకూడదు. మనం వారిపై ఆధిక్యంలో ఉన్నా.. ఒక సడెన్ మూవ్‌తో మనల్ని ప్రెజర్‌లోకి నెట్టగలడు. ధోనీ ఉంటే.. బ్యాటింగ్ అయినా, ఫీల్డింగ్ అయినా కచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి’ అని రోహిత్ శర్మ వ్యాఖ్యానించారు.