News March 12, 2025
BREAKING: KCRను కలిసిన పటాన్‌చెరు MLA

తెలంగాణ అసెంబ్లీ లాబీలో ఆసక్తికర పరిణామం ఈరోజు జరిగింది. అసెంబ్లీకి వచ్చిన BRS అధినేత KCRను పటాన్‌చెరు MLA గూడెం మహిపాల్ రెడ్డి కలిశారు. తన తమ్ముడి కుమారుడి పెళ్లికార్డును KCRకు ఇచ్చి ఆహ్వానించారు. కొన్ని నెలల క్రితం ఆయన BRSను వీడి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరగా ఇటీవల ఆయన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానూ మాట్లాడారు. ఈ క్రమంలో ఆయన KCRను కలవడంపై స్థానికంగా చర్చనీయాంశమైంది.
Similar News
News March 13, 2025
వెంకటాపూర్: Way2Newsకు స్పందన

“రామప్ప ప్రధాన కాలువకు బుంగ ” శీర్షికన ఈనెల 10న <<15710154 >>Way2Newsలో ప్రచురితమైన<<>> కథనానికి ములుగు జిల్లా నీటిపారుల శాఖ అధికారులు స్పందించారు. వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప ప్రధాన కాలువ ఐన ఒగరు కాలువ గండిని బుధవారం పూడ్చివేశారు. అనంతరం ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు Way2Newsకు కృతజ్ఞతలు తెలిపారు.
News March 13, 2025
HNK: ఇనుపరాతి గుట్ట భూములపై అధికారులతో కలెక్టర్ సమీక్ష

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలంలోని ముప్పారం, దేవునూరు గ్రామాల్లో విస్తరించి ఉన్న ఇనుపరాతి గుట్ట పరిధిలో ఫారెస్ట్ అధికారులు గుర్తించిన వ్యవసాయ పట్టాభూములపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. వ్యవసాయ భూముల సర్వే, సంబంధిత రైతుల గుర్తింపు, తదితర వివరాలను సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
News March 13, 2025
నితీశ్ రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లు: తేజస్వీ యాదవ్

బిహార్ సీఎం నితీశ్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ డిమాండ్ చేశారు. నితీశ్ రాష్ట్రాన్ని పాలించేందుకు ఫిట్‌గా లేరని దుయ్యబట్టారు. ఆయన ప్రవర్తన సరిగా లేదని, మహిళలను అవమానపరుస్తున్నారని తేజస్వీ ఆరోపించారు. నితీశ్ స్పృహ లేకుండా పాలన చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెంటనే పదవికి రాజీనామా చేసి ఆశ్రమానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.