News November 6, 2024

BREAKING.. KNR: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్పాట్ డెడ్

image

KNR జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల ప్రకారం.. రామడుగు మండలం షానగర్ గ్రామ సమీపంలో బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. రామడుగు మండల కేంద్రం నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం షానగర్ శివారు ప్రాంతంలో కరీంనగర్ నుంచి బైకుపై వెళ్తున్న శివాజీ, అరుణ్‌ను ఢీ కొట్టింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 23, 2025

KNR: ‘ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి’

image

KNR జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పోలీస్, రవాణా, ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖల అధికారులతో రోడ్డు భద్రత కమిటీ సమావేశం నిర్వహించారు. తరచుగా ప్రమాదాలు జరిగే ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించి, అక్కడ ప్రాణ నష్టం జరగకుండా తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.

News December 23, 2025

SRR కళాశాలలో బ్యూటీషియన్ కోర్సుకు గడువు పెంపు

image

KNR(D) SRR ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలలో బేసిక్ బ్యూటీషియన్ సర్టిఫికెట్ కోర్సులో ప్రవేశాలకు ఈనెల 31 వరకు గడువు ఉన్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ కల్వకుంట రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు తరగతులు జనవరి 2 నుంచి ప్రారంభమవుతాయని, ఫీజు రూ. 2,000గా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఇతర వివరాలకు కోర్సు కోఆర్డినేటర్, జంతుశాస్త్ర విభాగాధిపతి డా. కామాద్రి కిరణ్మయిని సంప్రదించాలని సూచించారు.

News December 23, 2025

హుజూరాబాద్ నుంచి శబరిమలకి సూపర్ లగ్జరీ సర్వీస్

image

హుజూరాబాద్, జమ్మికుంట ప్రాంతాల అయ్యప్ప స్వామి భక్తులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది. ప్రతి ఏడాది మకరజ్యోతి, మండల పూజల సందర్భంగా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు శబరిమలకి ప్రయాణం చేస్తున్న నేపథ్యంలో వారి సౌకర్యార్థం హుజూరాబాద్ నుంచి నేరుగా శబరిమలకి ప్రత్యేక సూపర్ లగ్జరీ సర్వీసులను ఏర్పాటు చేసింది. జనవరి 12 సోమవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఈ సర్వీసులు హుజూరాబాద్ డిపో నుంచి బయలుదేరుతాయని మేనేజర్ పేర్కొన్నారు.