News January 20, 2026
BREAKING.. KTDM: ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా

కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గట్టుగూడెం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. రాజమండ్రి నుంచి HYD వెళ్తున్న KVR ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది 5 అంబులెన్సులతో వెంటనే చేరుకుని, గాయపడిన 13 మందిని దమ్మపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 108 సిబ్బంది వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది.
Similar News
News April 14, 2026
మరోసారి చర్చలకు డేట్ ఫిక్స్!

యుద్ధానికి ఎండ్ కార్డ్ వేసేందుకు అమెరికా-ఇరాన్ మరోసారి శాంతి చర్చలు జరపాలని భావిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే గురువారం పీస్ టాక్స్‌కు అవకాశం ఉంది. అయితే మరోసారి ఇస్లామాబాద్‌ను వేదికగా ఎంచుకుంటారా? లేక మరో దేశంలో చర్చిస్తారా? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
News April 14, 2026
నోటి పుండ్లు.. క్యాన్సర్ సంకేతం కావొచ్చన్న వైద్యులు

ఎండాకాలం వేడి వల్ల నోటిలో పుండ్లు వచ్చి వాటంతట అవే తగ్గుతాయని నిర్లక్ష్యం చేయొద్దని, 14 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే టెస్టులు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ‘ముఖ్యంగా పొగాకు వాడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. వైద్యులు అవసరమైతే బయాప్సీ పరీక్ష ద్వారా అది సాధారణ పుండా లేదా క్యాన్సర్ సంకేతమా అని నిర్ధారిస్తారు. ప్రాథమిక దశలోనే గుర్తిస్తే ప్రాణాపాయం తప్పుతుంది’ అని చెబుతున్నారు.
News April 14, 2026
GNT: మిర్చి రాకలు తగ్గుదల.. యార్డుకు దెబ్బ

గుంటూరు మిర్చి యార్డులో ఈ సీజన్‌లో రాకలు గణనీయంగా తగ్గాయి. గతంలో రోజుకు 2 లక్షల టిక్కీలు వచ్చేవి. ఇప్పుడు సగటు 1.30 లక్షలకే పరిమితం అవుతున్నాయి. సాగు విస్తీర్ణం 1.60 లక్షల హెక్టార్ల నుంచి 90 వేల హెక్టార్లకు తగ్గింది. గత సీజన్‌లో ధరలు లేకపోవడం, వాతావరణ ప్రభావం కారణాలుగా చెబుతున్నారు. యార్డు ఆదాయం కూడా ప్రభావితమైంది. గత ఏడాది రూ.20 కోట్ల లోటు రాగా, ఈ ఏడాదీ అదే పరిస్థితి కొనసాగుతోంది.


