News December 3, 2024

BREAKING: ఆందోళనకరంగా మహారాష్ట్ర సీఎం ఆరోగ్యం

image

మహారాష్ట్ర కేర్‌టేకర్ సీఎం ఏక్‌నాథ్ శిండే ఆరోగ్యం ఆందోళనకరంగా మారింది. కొన్నిరోజులుగా ఆరోగ్య పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఆయనను థానేలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శిండేకు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని వైద్యులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 27, 2025

సారంగాపూర్: ‘వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

image

సారంగాపూర్ మండలం అర్పపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ను అదనపు కలెక్టర్ బీ.ఎస్.లత గురువారం పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజనం నాణ్యత, మెనూ, రిజిస్టర్లను తనిఖీ చేశారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయులకు సూచించారు. గైర్హాజరైన విద్యార్థిని అక్షిత ఇంటికి వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.

News November 27, 2025

వారికి నిద్ర అవసరం: సుందర్ పిచాయ్

image

‘జెమిని 3’ మోడల్‌ కోసం తన బృందం కొన్ని వారాల పాటు విరామం లేకుండా పని చేసిందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ‘ఉద్యోగులంతా ఎంతో అలసిపోయారు. కొందరికి నిద్ర అవసరం. ఇప్పుడు తగిన విశ్రాంతి దొరుకుతుందని ఆశిస్తున్నా’ అని చెప్పారు. ‘గూగుల్ ఏఐ: రిలీజ్ నోట్స్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడారు. జెమిని 3 ఏఐ మోడల్‌ను ఇటీవల గూగుల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

News November 27, 2025

నిర్మాతలను బ్లేమ్ చేయొద్దు: SKN

image

కంఫర్ట్ కోసం ఎక్కువ ఖర్చు చేస్తూ ప్రొడ్యూసర్స్‌‌ను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని ప్రేక్షకులనుద్దేశించి నిర్మాత SKN పేర్కొన్నారు. ‘మనం కంఫర్ట్, లగ్జరీ కావాలి అనుకున్నప్పుడే ఎక్కువ పే చేయాలి. కేవలం కంఫర్ట్ కోసమే ఎక్స్‌ట్రా చెల్లిస్తున్నాం. లగ్జరీ థియేటర్లో చూడాలంటే రియల్‌ఎస్టేట్ వాల్యూ ప్రకారం టికెట్, రిఫ్రెష్‌మెంట్ రేట్లుంటాయి. వాటితో నిర్మాతకొచ్చే ఎక్స్‌ట్రా బెనిఫిట్ ఏమీ ఉండదు’ అని తెలిపారు.