News June 18, 2024
BREAKING: ఎయిర్‌పోర్టులను పేల్చేస్తామంటూ మెయిల్స్

దేశవ్యాప్తంగా 40 ఎయిర్‌పోర్టుల్లో బాంబులు పెట్టామంటూ దుండగులు మెయిల్స్ చేశారు. ఢిల్లీ, పట్నా, జైపూర్, వడోదరా, కోయంబత్తూర్ తదితర విమానాశ్రయాలను పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అప్రమత్తమైన సిబ్బంది బాంబ్ స్వ్కాడ్‌తో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News March 16, 2026
స్టాక్ మార్కెట్లు ఇవాళ ఎలా ఉన్నాయంటే?

యుద్ధ ప్రభావం నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు నెమ్మదిగా తేరుకుంటున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలు నిలిపివేసి పెట్టుబడులపై దృష్టి సారిస్తున్నారు. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ ఇవాళ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అల్ట్రాటెక్ సిమెంట్, JSW స్టీల్, హిందాల్కో, ITC, టాటా స్టీల్, అపోలో, కొటక్, సిప్లా, ఇండిగో షేర్లు లాభాల్లో ఉన్నాయి. బెల్, శ్రీరామ్ ఫైనాన్స్, ONGC, HAL, M&M, ట్రెంట్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
News March 16, 2026
అవతార్‌కు ఆస్కార్.. విమర్శలు!

అవతార్ ఫైర్ అండ్ యాష్‌కు విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో ఆస్కార్ దక్కింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం ఆకట్టుకోలేదు. అయినా ఆస్కార్ రావడంపై కొందరు IND సినీ ఫ్యాన్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. హాలీవుడ్‌లో సినిమాలు ఎలా ఉన్నా ఆస్కార్ ఈజీగా వస్తుందని, భారతీయ చిత్రాలు ఎంత బాగా తీసినా ఇవ్వరని కామెంట్స్ చేస్తున్నారు. అయితే విజువల్ వండర్ కావడంతోనే అవతార్‌కు అవార్డు వచ్చిందని మరికొందరు అంటున్నారు. మీ కామెంట్?
News March 16, 2026
ప్రేయసికి భర్తను ‘లీజు’కు ఇస్తానన్న భార్య.. కానీ!

మోసం చేసిన భర్తకు విడాకులు ఇవ్వకుండా అతనిని ప్రేయసికే అద్దెకు ఇవ్వడానికి సిద్ధమైందో భార్య. దీనిద్వారా ఖున్ క్వాంగ్ నెలకు ₹85వేలు డిమాండ్ చేసింది. ఈ ఘటన థాయిలాండ్‌లో జరిగింది. వీరికి వివాహమై 10 ఏళ్లయింది. గతేడాది ఓ మహిళతో భర్త అక్రమ సంబంధాన్ని భార్య గుర్తించింది. దీనిపై ప్రశ్నించగా ఇరువురూ విడిచి ఉండలేమన్నారు. దీంతో ఆమె అద్దె ప్రతిపాదన పెట్టగా ప్రేయసి ఒప్పుకుంది. కానీ భర్త అంగీకరించలేదు.


