News April 5, 2025
BREAKING: పపువా న్యూగినియాలో భారీ భూకంపం

పపువా న్యూగినియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.2గా నమోదైంది. యూఎస్ సునామీ వార్నింగ్ సెంటర్ సునామీ హెచ్చరికలు జారీ చేసింది. భూకంప కేంద్రం 49 కి.మీ లోతున ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంట వ్యవధిలోనే మూడు సార్లు భూమి కంపించినట్లు పేర్కొన్నారు. ఆస్తి, ప్రాణ నష్ట వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మయన్మార్లో సంభవించిన భూకంపంలో దాదాపు 3000 మంది మరణించిన విషయం తెలిసిందే.
Similar News
News April 5, 2025
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

AP: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. టోకెన్లు లేని వారికి శ్రీవారి సర్వ దర్శనానికి 12గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 15 కంపార్టుమెంట్లలో వేంకటేశ్వరుడి దర్శనం కోసం భక్తులు వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 66,327 మంది దర్శించుకోగా, 26,354 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.
News April 5, 2025
నేడు భద్రాచలానికి పవన్ కళ్యాణ్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు భద్రాచలానికి వెళ్లనున్నారు. సాయంత్రం హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం వెళ్లి రాత్రి అక్కడే బస చేస్తారు. ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా ఆలయంలో జరిగే సీతారాముల కళ్యాణంలో పాల్గొంటారు. ఏపీ ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ మాదాపూర్లోని తన నివాసానికి చేరుకుంటారు. పవన్ పర్యటనకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
News April 5, 2025
నేడు స్కూళ్లకు సెలవు

నేడు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఇచ్చారు. అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. బ్యాంకులు సైతం పని చేయవు. అటు ఏపీలో ఇవాళ పబ్లిక్ హాలిడే ప్రకటించకపోవడంతో విద్యాసంస్థలు యథావిధిగా నడవనున్నాయి. చిన్న వయసులోనే కులవివక్షను ఎదుర్కొన్న జగ్జీవన్ రామ్.. అణగారిన వర్గాల కోసం పోరాడారు. మన దేశంలో అత్యధిక కాలం (30 ఏళ్లు) కేంద్రమంత్రిగా పని చేసిన రికార్డు ఈయనదే.