News April 6, 2024
BREAKING: భారీ ఎన్కౌంటర్

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మరో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ములుగు జిల్లా కర్రిగుట్టలు, ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ పరిధిలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టులు ఎదురుపడటంతో కాల్పులు చోటు చేసుకున్నాయి. దీంతో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ఘటనాస్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. 4 రోజుల క్రితం బీజాపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో 13 మంది మావోయిస్టులు మరణించారు.
Similar News
News November 16, 2025
ibomma రవి: సీఈవో నుంచి పైరసీ దాకా..

పైరసీ మూవీ వెబ్సైట్ ibomma నిర్వాహకుడు ఇమ్మడి రవి నిన్న అరెస్టయిన విషయం తెలిసిందే. అతడు గతంలో ER ఇన్ఫోటెక్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి CEOగా పని చేశాడు. ఐదేళ్ల క్రితం భార్యతో విడాకులు తీసుకున్నాడని, తర్వాత పైరసీ రంగంలోకి అడుగుపెట్టాడని తెలుస్తోంది. సర్వర్లను ఈజీగా హ్యాక్ చేయగలిగేలా పట్టు సాధించాడని సమాచారం. అయితే తనను పోలీసులు పసిగట్టరనే ధీమాతో విదేశాల నుంచి కూకట్‌పల్లికి వచ్చి దొరికిపోయాడు.
News November 16, 2025
‘వారణాసి’ గ్లింప్స్.. ఇవి గమనించారా?

రాజమౌళి, మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ నుంచి రిలీజైన గ్లింప్స్ SMను షేక్ చేస్తోంది. 3.40 నిమిషాల నిడివి ఉన్న ఈ విజువల్ వండర్‌ను నెటిజన్లు డీకోడ్ చేసే పనిలోపడ్డారు. వారణాసి(512CE)లో మొదలయ్యే టైమ్ ఫ్రేమ్ వారణాసి(మణికర్ణికా ఘాట్)లోనే ముగుస్తోందని కామెంట్లు చేస్తున్నారు. ప్రతి ఫ్రేమ్‌లో ఎక్కడో ఒకచోట మహేశ్ కనిపించేలా వీడియో రూపొందించారని పేర్కొంటున్నారు. గ్లింప్స్ మీకెలా అనిపించింది?
News November 16, 2025
సోషల్ మీడియాలో వేధింపులా..

టెక్నాలజీ లైఫ్‌ని ఎంత ఈజీ చేసిందో.. దాంతో పాటు కొన్ని సమస్యలు కూడా తెచ్చింది. వాటిల్లో ఒకటి ఆన్ లైన్ వేధింపులు. వీటిని తగ్గించాలంటే..సోషల్‌మీడియా ఖాతాలకు సంబంధించి ప్రైవసీ సెట్టింగ్స్ మార్చుకోవాలి. అనుమానాస్పద ఖాతాలు కనిపిస్తే వాటిని వెంటనే బ్లాక్ చేసి.. రిపోర్టు చేయాలి. సోషల్‌మీడియా ఖాతాల ఐడీ, పాస్వర్డ్స్ ఎవరితోనూ పంచుకోవద్దు. ఎవరైనా వేధింపులకు దిగితే.. సందేశాలను స్క్రీన్‌షాట్స్ తీసుకోండి.


