News September 3, 2024
భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోలు మృతి

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. దంతెవాడ-బీజాపుర్ జిల్లాల సరిహద్దుల్లోని దండకారణ్యంలో భద్రతా బలగాల కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఘటనాస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News December 2, 2025
హిల్ట్ పాలసీపై BRS పోరు బాట

TG: <<18440700>>హిల్ట్<<>> పాలసీతో ప్రజలకు నష్టం కలుగుతోందని ఆరోపిస్తూ పోరుబాటకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీని కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR 8 నిజ నిర్ధారణ బృందాలు ఏర్పాటు చేశారు. HYD చుట్టుపక్కల పారిశ్రామిక వాడలను 8 క్లస్టర్లుగా విభజించి రేపు, ఎల్లుండి ఆ ప్రాంతాల్లో ఈ టీమ్స్ పర్యటించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. రూ.5 లక్షల కోట్ల భూ కుంభకోణం నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.
News December 2, 2025
హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రంలో ఉద్యోగాలు

హైదరాబాద్ <
News December 2, 2025
దిత్వా తుఫాన్.. ఈ జిల్లాలకు వర్ష సూచన

AP: బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.


