News May 23, 2024

BREAKING: భారీ ఎన్‌కౌంటర్

image

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఎదురుకాల్పుల్లో 100 మందికి పైగా నక్సల్స్ మృతి చెందారు.

Similar News

News November 16, 2025

TG న్యూస్ రౌండప్

image

* ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ ఇవాళ HYDలో పర్యటించారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ ఏర్పాటుచేసిన తేనీటి విందుకు CM రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ హాజరయ్యారు.
* రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ నెల 21న HYDలో భారతీయ కళా మహోత్సవానికి హాజరవుతారు. అక్కడి నుంచి పుట్టపర్తికి వెళ్లి సత్యసాయిబాబా శతజయంతి వేడుకల్లో పాల్గొంటారు.
* రైతులకు యాసంగి బోనస్ రూ.200 కోట్లను వెంటనే విడుదల చేయాలి: హరీశ్ రావు

News November 16, 2025

RRB PO అడ్మిట్ కార్డులు విడుదల

image

IBPS RRB PO(Officer Scale-I) ప్రిలిమ్స్ పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.ibps.in/లో తమ రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్, పాస్‌వర్డ్‌తో హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ నవంబర్ 22, 23 తేదీల్లో జరగనుంది. మెయిన్స్ అడ్మిట్ కార్డులు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 మధ్య అందుబాటులోకి వస్తాయి. కాగా ఈ నోటిఫికేషన్ ద్వారా 3,928 పోస్టులను భర్తీ చేయనున్నారు.

News November 16, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

☛ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా రిలీజ్ డేట్‌లో మార్పు.. ముందుగా ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే (NOV 27) థియేటర్లలోకి సినిమా.. ఈ నెల 18న ట్రైలర్
☛ నాగార్జున ‘శివ’ రీరిలీజ్‌కు 2 రోజుల్లో ₹3.95Cr గ్రాస్ కలెక్షన్స్
☛ నాగ్ అశ్విన్ నిర్మాణంలో సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగా త్వరలో సినిమా: సినీ వర్గాలు
☛ ధనుష్ డైరెక్షన్‌లో రజినీ హీరోగా సినిమా తెరకెక్కే అవకాశం: తమిళ సినీ వర్గాలు