News April 2, 2024

BREAKING: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

image

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లా పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మరణించిన సంగతి తెలిసిందే.

Similar News

News March 16, 2026

నేడే రాజ్యసభ ఎన్నికలు.. బరిలో నితీశ్ కుమార్

image

రాజ్యసభలో 37 స్థానాలకు ఇవాళ ఎన్నిక జరగనుంది. TG(2 స్థానాలు)తో పాటు బెంగాల్, అస్సాం, బిహార్, TN, MH, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, హరియాణా, HPలో ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 26 స్థానాలు ఏకగ్రీవం కానుండగా 11 సీట్ల కోసం పోలింగ్ నిర్వహిస్తారు. బిహార్ CM నితీశ్ కుమార్, BJP జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్ బరిలో ఉన్నారు. పోలింగ్ తర్వాత ఫలితాలు ప్రకటిస్తారు. MPగా ఎన్నికయ్యాక CM పదవికి నితీశ్ రాజీనామా చేసే అవకాశముంది.

News March 16, 2026

జూన్‌లో 2 ఎయిర్‌పోర్టులకు శంకుస్థాపన?

image

TG: వరంగల్(D) మామునూరు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి జూన్‌లో శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కార్యక్రమానికి PM మోదీని ఆహ్వానించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మామునూరుకు రూ.850 కోట్లు, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు రూ.1,061 కోట్లు అవసరమని అంచనా. ఇక్కడ పౌర, మిలిటరీ విమానాలు ల్యాండయ్యేలా రన్‌వేను నిర్మించనున్నారు. అలాగే డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్‌నూ ఏర్పాటు చేస్తారని సమాచారం.

News March 16, 2026

ఏపీలో రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం

image

AP: ఎండలు ముదురుతుండటంతో రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో నమోదవుతోంది. ఏప్రిల్-మేలో గరిష్ఠ డిమాండ్ 280MUలుగా అంచనా వేయగా ఈ నెలలోనే 274MUలకు చేరింది. ఇందుకు తగ్గట్లుగానే ఏపీ జెన్‌కో <<19368040>>భారీగా<<>> విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. విజయవాడ VTPS, కడప RTPP, కృష్ణపట్నంలో దాదాపు 10 లక్షల టన్నుల బొగ్గు నిల్వలున్నాయి. కాబట్టి కరెంట్ ఉత్పత్తికి ఎలాంటి ఢోకా ఉండదని నిపుణులు <<19384107>>చెబుతున్నారు<<>>.