News April 11, 2024
BREAKING: ముంబై ఘనవిజయం

RCBతో జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. 197 పరుగుల లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే చేధించింది. ముంబై బ్యాటర్లలో ఇషాన్ 69, సూర్య 52, రోహిత్ 38 రన్స్తో రాణించారు. ఈ సీజన్లో ముంబైకి ఇది రెండో విజయం కాగా ఆర్సీబీకి ఐదో ఓటమి.
Similar News
News January 20, 2026
పెట్టుబడుల గమ్యస్థానం AP: CM CBN

AP: బ్రాండ్ ఇమేజ్ కారణంగా రాష్ట్రంలో పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు సానుకూలంగా ఉన్నారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఏపీని మించిన పెట్టుబడుల గమ్యస్థానం మరొకటి లేదని స్పష్టం చేశారు. వెయ్యి KMల సముద్రతీరం, పోర్టులు, ఎయిర్పోర్టులు రాష్ట్రానికి బలమని పేర్కొన్నారు. 2047కు భారత్ ప్రపంచ శక్తిగా మారుతుందన్నారు. దావోస్ సమ్మిట్లో ఇండియా లాంజ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేశారు.
News January 20, 2026
జోగి సోదరులకు బెయిల్

AP: కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు బెయిల్ మంజూరైంది. భవానీపురంలో నమోదైన కేసులో బెయిల్ లభించగా, మొలకలచెరువు కేసులో ఆయన రిమాండ్ కొనసాగుతోంది. ప్రస్తుతం వీరిద్దరూ విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
News January 20, 2026
4 గంటలుగా కొనసాగుతున్న హరీశ్ విచారణ

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ పీఎస్లో మాజీ మంత్రి హరీశ్ రావు విచారణ కొనసాగుతోంది. సుమారు 4 గంటలకుపైగా సిట్ అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఓ ప్రైవేటు ఛానెల్ ఎండీ స్టేట్మెంట్ ఆధారంగా ఆయనపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. వాటికి హరీశ్ కూడా దీటుగా సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. అటు మాజీ మంత్రి విచారణపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.


