News March 19, 2024

BREAKING.. MBNR: ప్రభుత్వ కళాశాల లెక్చరర్ ఆత్మహత్యాయత్నం

image

నాగర్ కర్నూల్ జిల్లాలోని ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెల్దండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా చేస్తున్న శంకర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. శంకర్‌ను కల్వకుర్తి ఆసుపత్రికి తరలించారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News September 21, 2024

SDNR: భార్యను చంపిన భర్తకు జీవిత ఖైదు

image

భార్యను చంపిన కేసులో భర్తకు జీవిత ఖైదు పడినట్లు షాద్ నగర్ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. ఫరూక్ నగర్ మండలం అన్నారం గ్రామపంచాయతీలోని గుండ్యా తండాకు చెందిన జటావత్ రమేశ్ చెడు వ్యసనాలకు అలవాటు పడి భార్య లలిత(30)ను 2020 అక్టోబర్ 26న కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ కేసుపై విచారణ జరిపిన జిల్లా కోర్టు న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడు రమేశ్‌కు జీవిత ఖైదుతోపాటు రూ.25వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు.

News September 21, 2024

తెలుగు యూనివర్సిటీకి సురవరం పేరు.. చిన్నారెడ్డి హర్షం

image

వనపర్తి: మొట్టమొదటి ఎమ్మెల్యే దివంగత సురవరం ప్రతాపరెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి పెడుతూ క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడం హర్షనీయమని రాష్ట్ర ప్రణాళికాసంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. స్వాతంత్రోద్యమంలో గోల్కొండ పత్రికతో ఉద్యమస్ఫూర్తి, పోరాటజ్వాలలు రగిలించిన గొప్ప వ్యక్తి సురవరంప్రతాపరెడ్డి అని కొనియాడారు.

News September 21, 2024

MBNR: రేపే సవరణ.. 28న తుది జాబితా

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 13న ఓటర్ జాబితా ముసాయిదాను అధికారులు విడుదల చేశారు. ఇప్పటికే మండల స్థాయి, జిల్లా స్థాయిలో ఎన్నికల సంఘం గుర్తింపు ఉన్న పార్టీలతో సమావేశాలు నిర్వహించారు. ఓటరు జాబితా సవరణపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఓటర్ జాబితాలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 21వ తేదీ వరకు తెలియజేయవచ్చని, 28న తుది ఓటర్ జాబితాను విడుదల చేస్తామని డీపీఓ పార్థసారథి తెలిపారు.