News November 7, 2024

BREAKING: MBNR: లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన DEO

image

ఉపాధ్యాయుని వద్ద లంచం తీసుకుంటూ మహబూబ్‌నగర్ DEO రవీందర్‌ గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. వారి వివరాల ప్రకారం.. ఉపాధ్యాయునికి సీనియారిటీ విషయంలో జరిగిన పొరపాటును సరిదిద్దేందుకు డీఈఓను సంప్రదించగా రూ.50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో సదరు ఉపాధ్యాయుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ కృష్ణ గౌడ్ డీఎస్పీ DEO ఇంట్లో లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు.

Similar News

News December 10, 2024

MBNR: రాష్ట్రంలోనే అవినీతిలో మనమే టాప్!

image

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ACB అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా 15 మంది పట్టుబడగా.. 22 మందిని కోర్టులో హాజరు పరిచారు. రాష్ట్రంలోనే అత్యధిక అవినీతి కేసులు ఉమ్మడి పాలమూరులోనే నమోదయ్యాయి. లంచం ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమే, లంచాన్ని ఉపేక్షించకండి అవినీతి రహిత సమాజం కోసం పాటుపడుదాం. లంచం డిమాండ్ చేస్తే సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. నేడు అవినీతి వ్యతిరేక దినోత్సవం సందర్భంగా “Way2News” ప్రత్యేక కథనం

News December 10, 2024

MBNR: తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణలో జిల్లా నాయకులు

image

హైదరాబాద్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లాల చిన్నారెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు సోమవారం పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక సాంప్రదాయాలకు ప్రతికగా చిత్రకారులు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించినట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ ప్రముఖ నాయకులు, తదితరులు ఉన్నారు.

News December 10, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!

image

✔ఘనంగా సోనియాగాంధీ జన్మదిన వేడుకలు ✔పాలమూరులో పెరిగిన కోడి గుడ్ల ధరలు ✔తెలంగాణ తల్లి తొలివిగ్రహం.. మన పాలమూరులోనే ✔సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి:STU ✔గద్వాల: 13న ఐటీఐ అప్రెంటిస్ జాబ్ మేళా ✔Way2Newsతో JL సాధించిన అనిల్ కుమార్ ✔గ్రూప్-2 పరీక్ష.. ఏర్పాట్ల పై ఫోకస్ ✔NGKL: స్కూల్ అమ్మాయిలపై వేధింపులు.. ఇద్దరికి జైలు శిక్ష ✔విలేఖరులకు అండ TUWJ: మధు ✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్