News August 16, 2024

BREAKING: MDK: హరీశ్‌రావుపై ఫ్లెక్సీల కలకలం

image

HYDలో హరీశ్ రావుపై ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. రాత్రికి రాత్రే మల్కాజిగిరి మాజీMLA మైనంపల్లి హనుమంతరావు అభిమానుల పేరిట ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి హరీశ్‌రావు రాజీనామాకు డిమాండ్ చేశారు. ‘దమ్ముంటే రాజీనామ్ చెయ్.. రుణమాఫీ అయిపోయే..నీ రాజీనామా ఏడబోయే.. అగ్గిపెట్ట హరీశ్ రావు’ అని రాసి ఉన్న ఫ్లెక్సీలను సికింద్రాబాద్, ప్యాట్నీ, ప్యారడైజ్, రసూల్‌పుర, బేగంపేట్, పంజాగుట్ట సహా పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు.

Similar News

News September 16, 2024

గుండెపోటుతో టీచర్ మృతి.. నేత్రదానం

image

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మోడల్ స్కూల్ పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడు ధ్యాప వెంకటస్వామి(49) ఈ ఉదయం గుండెపోటుతో మరణించారు. మృతుడి స్వస్థలం జగదేవ్పూర్ మండలం అలిరాజపేట గ్రామం. అతడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు, వయస్సు మీద పడిన తల్లిదండ్రులు ఉన్నారు. వెంకట్ అకాల మరణంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పుట్టెడు దు:ఖంలోనూ నేత్రదానానికి ఆ కుటుంబీకులు ముందుకొచ్చి మరో ఇద్దరికి చూపు ఇచ్చారని మిత్రబృందం తెలిపింది.

News September 16, 2024

సిద్దిపేటలో అత్యధిక వర్షపాతం నమోదు

image

తెలంగాణలో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే వర్షాకాలం కురవాల్సిన దానికంటే ఎక్కువగా కురిసినట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏటా రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 738 మీమీ కురుస్తుంది. ఈ మేరకు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ ఈ సీజన్‌లో సెప్టెంబర్ 11 వరకు 897 మీ.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు నిర్ధారించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేటలో ఎక్కువగా కురిసిందని తెలిపారు.

News September 15, 2024

సంగారెడ్డి: అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: డీఈవో

image

ఇన్‌స్పైర్ దరఖాస్తు గడువు అక్టోబర్ 15 వరకు పెంచినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఇన్‌స్పైర్‌కు దరఖాస్తు చేయని విద్యార్థులు గడువు పెంపును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ తీసుకొని విద్యార్థుల చేత దరఖాస్తు చేయించాలని సూచించారు.