News August 2, 2024
BREAKING: MDK: 9వ తరగతి బాలిక ఆత్మహత్య

HYD కాప్రా మండలం జవహర్నగర్ PS పరిధిలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలాజీనగర్లో నివాసం ఉంటున్న బాలిక(16) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో 9వ తరగతి చదువుతోంది. అయితే బాలాజీనగర్లోని ఇంటికి ఆమె ఇటీవల రావడంతో శివ అనే యువకుడు ప్రేమ పేరుతో ఆమెను లైంగికంగా వేధించాడు. దీంతో గురువారం రాత్రి ఉరేసుకుని ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News December 23, 2025
MDK: నాలుగు పర్యాయాలు ఒకే కుటుంబం సర్పంచ్

మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటకు చెందిన ఒకే కుటుంబం 4 పర్యాయాలుగా సర్పంచ్ పదవికి ఎన్నికయ్యారు. 2025లో జరిగిన ఎన్నికల్లో శివగోని పెంటా గౌడ్ సర్పంచిగా గెలుపొందారు. 2006లో పెంట గౌడ్ తమ్ముడు రాజాగౌడ్, ఆ తర్వాత జరిగిన 2012, 2018లో జరిగిన ఎన్నికల్లో పెంటాగౌడ్ తల్లి సుగుణమ్మ రెండు పర్యాయాలు సర్పంచ్ పనిచేశారు. రాజాగౌడ్ భార్య ఎంపీటీసీగా సేవలందించారు.
News December 23, 2025
MDK: నేడు లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా

జిల్లాలో ఆహార వ్యాపార నిర్వాహకుల(ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కోసం నేడు ఎఫ్ఎస్ఎస్ఏఐ(FSSAI ) లైసెన్స్, రిజిస్ట్రేషన్ మేళా నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా ఆహార తనిఖీ అధికారి స్వదీప్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో S-29లో ఉదయం 11.00 గంటల నుంచి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ ఆదేశాల మేరకు నిర్వహించబడుతుందని తెలిపారు. వివరాలకు 9441956370 సంప్రదించాలన్నారు.
News December 22, 2025
మెదక్: భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: కలెక్టర్

భూ భారతి దరఖాస్తులను శాశ్వతంగా పరిష్కరించాలని, అధికారులు సమయ పాలనా పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వచ్చిన ప్రతి దరఖాస్తును క్షేత్ర స్థాయిలో పరిశీలించి పరిష్కారం చూపాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులు తప్పని సరిగా సమయ పాలనా పాటించాలన్నారు. కార్యాలయాలలో తప్పకుండా హాజరును నమోదు చేయాలన్నారు.


