News November 27, 2024

BREAKING: మెగా డీఎస్సీ సిలబస్‌ విడుదల

image

AP: మెగా డీఎస్సీ సిలబస్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఏపీ డీఎస్సీ వెబ్‌సైటులో సిలబస్‌ను అందుబాటులో ఉంచింది. DSC ద్వారా 16,347 టీచర్ ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయనుంది. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సిలబస్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

Similar News

News December 4, 2025

తెలంగాణలో అఖండ-2 టికెట్ రేట్ల పెంపు

image

‘అఖండ-2’ సినిమా టికెట్ రేట్ల <<18450771>>పెంపునకు<<>> TG ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇవాళ రా.8 గంటల నుంచి ప్రీమియర్స్ మొదలవనున్నట్లు పేర్కొంది. ప్రీమియర్ షో టికెట్ రేట్‌ను రూ.600గా నిర్ధారించింది. తర్వాతి 3 రోజులు సింగిల్ స్క్రీన్‌కు రూ.50, మల్టీప్లెక్స్‌లకు రూ.100 చొప్పున పెంచుకోవచ్చని తెలిపింది. టికెట్ రేట్ల పెంపుతో వచ్చే రెవెన్యూలో 20% మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కు ఇవ్వాలని GOలో పేర్కొంది.

News December 4, 2025

చనిపోయినట్లు నటించే బ్యాక్టీరియా!

image

అత్యంత అరుదైన బ్యాక్టీరియా(టెర్సికోకస్ ఫీనిసిస్)ను US సైంటిస్టులు కనుగొన్నారు. స్పేస్‌క్రాఫ్ట్ అసెంబ్లీ రూమ్స్ లాంటి భూమిపై ఉన్న అతి పరిశుభ్రమైన వాతావరణాలలోనూ ఇది జీవించగలదని తెలిపారు. ‘తన మనుగడను కొనసాగించడానికి చనిపోయినట్లు నటిస్తుంది. వీటిని గుర్తించడం, నాశనం చేయడం కష్టం. ఏదైనా బ్యాక్టీరియా వ్యాప్తి కట్టడికి కఠినమైన శుభ్రతా ప్రమాణాలు ఎందుకు పాటించాలో ఇలాంటివి నిరూపిస్తాయి’ అని పేర్కొన్నారు.

News December 4, 2025

మనసునూ పట్టించుకోవాలి: సారా అలీఖాన్

image

శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలాముఖ్యమని బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ అంటున్నారు. భావోద్వేగాలను అణిచివేయడం బలం కాదు. వాటిని అంగీకరించే ధైర్యం కలిగి ఉండటం ముఖ్యం అంటున్నారు. ప్రస్తుత తరం మానసిక ఆరోగ్యంపై దృష్టి పెట్టట్లేదు. శరీరానికి ఇచ్చే శ్రద్ధ మనసుకు కూడా ఇస్తేనే మనం బలంగా ఉన్నట్లు అర్థం. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక శ్రేయస్సు గురించి కూడా చర్చించాలంటున్నారు.