News October 2, 2024

రైల్వేట్రాక్‌ను పేల్చేసిన దుండగులు

image

ఝార్ఖండ్‌లో దుండగులు రెచ్చిపోయారు. సాహిబ్‌గంజ్ జిల్లా రంగాగుట్టు గ్రామం వద్ద రైల్వేట్రాక్‌పై పేలుడు పదార్థాలు అమర్చి పేల్చేశారు. దీంతో ట్రాక్‌పై మూడడుగుల గొయ్యి పడింది. ట్రాక్ పరికరాలు సుమారు 40 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డాయి. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Similar News

News October 2, 2024

మేం పనిగట్టుకొని సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదు: మంత్రి సీతక్క

image

TG: తామేమీ పనిగట్టుకొని సినిమా వాళ్ల గురించి మాట్లాడలేదని మంత్రి సీతక్క అన్నారు. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖులపై మాత్రమే మాట్లాడామని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఉద్దేశిస్తూ అన్నారు. తాము సినీ నటులకు వ్యతిరేకం కాదని, వాళ్లను ద్వేషించడం లేదని స్పష్టం చేశారు. KTR తమను శిఖండి అని ఎలా అంటారని ఆమె ప్రశ్నించారు. తమ నోళ్లను పినాయిల్‌తో కడగాలన్న KTR నోటినే యాసిడ్‌తో కడగాలని ధ్వజమెత్తారు.

News October 2, 2024

ఫోన్ల ధరలు పెరిగే ఛాన్స్!

image

ప్రపంచవ్యాప్తంగా సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు పెరిగే ఛాన్స్ ఉంది. అమెరికాలోని నార్త్ కరోలినాలో హెలెన్ హరికేన్ కారణంగా క్వార్ట్జ్ ఉత్పత్తి ఆగిపోయింది. బ్రెజిల్, రష్యాల్లో క్వార్ట్జ్ లభించినా.. సెమీకండక్టర్లలో ఉపయోగించే నాణ్యమైన క్వార్ట్జ్ నార్త్ కరోలినాలోనే దొరుకుతుంది. వరదల కారణంగా విద్యుత్ సరఫరా, రవాణా ఆగిపోవడంతో సప్లై చైన్ తెగిపోయింది.

News October 2, 2024

వడ్డీరేట్ల కోతకు టైమొచ్చింది: RBI మాజీ గవర్నర్ రంగరాజన్

image

ఇన్‌ఫ్లేషన్ స్లోడౌన్ అవ్వడంతో వడ్డీరేట్ల కోతకు టైమ్ వచ్చిందని RBI మాజీ గవర్నర్ సీ రంగరాజన్ అన్నారు. రెండు దఫాల్లో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం మంచిదన్నారు. ఒకవేళ రెపోరేట్ తగ్గిస్తే మార్కెట్లను నడిపించడం కాకుండా అనుసరించడం కిందకు వస్తుందన్నారు. ఆగస్టులోనే RBI రెపోరేట్ తగ్గిస్తుందని ఎకానమిస్టులు అంచనా వేశారు. ఫుడ్ ఇన్‌ఫ్లేషన్ నిలకడగా 4% లోపు ఉంటేనే ఆలోచిస్తామని శక్తికాంతదాస్ స్పష్టం చేశారు.