News February 24, 2025
BREAKING: ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ను ఈసీ విడుదల చేసింది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలున్నాయి. మార్చి 3న నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ ఉండనుంది. ఏపీలో జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, పరుచూరి అశోక్ బాబు, తిరుమలనాయుడు, రామారావు, తెలంగాణలో మహమూద్ అలీ, సత్యవతి, సుభాష్ రెడ్డి, మల్లేశం, రియాజుల్ హుస్సేన్ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది.
Similar News
News September 15, 2025
పలు కాలేజీలు బంద్.. ఎగ్జామ్స్కు మినహాయింపు!

TG: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలో పలు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు బంద్కు పిలుపునిచ్చాయి. అయితే పరీక్షలకు ఈ బంద్ మినహాయింపు ఉంటుందని తెలిపాయి. అయితే మరికొన్ని కాలేజీలు మాత్రం యథావిధిగా కొనసాగుతున్నాయి. కాగా ఇవాళ మధ్యాహ్నం ప్రభుత్వంతో చర్చల తర్వాత బంద్పై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశముంది.
News September 15, 2025
అందాల రాణి.. ఆర్మీ ఆఫీసర్గా..

పుణే (MH)కు చెందిన కాశీష్ మెత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా కిరీటాన్ని గెలుచుకున్నారు. మోడలింగ్, యాక్టింగ్లో ఎన్నో ఆఫర్లు వచ్చాయి. అంతేకాదు బయోటెక్నాలజీలో మాస్టర్స్ చేశారు. హార్వర్డ్లో PhD ఛాన్స్ వచ్చింది. కానీ వీటిని లెక్క చేయకుండా దేశం కోసం ఆర్మీలో చేరాలనుకున్నారు. 2024లో CDS ఎగ్జామ్లో ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించారు. ప్రస్తుతం ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ (AAD)లో పని చేస్తున్నారు.
News September 15, 2025
భారత రత్నం మోక్షగుండం

దేశం గర్వించే ఇంజినీర్లలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ముందు వరుసలో ఉంటారు. 1908లో HYDలో మూసీ పొంగి 15వేల మంది మరణిస్తే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించి వరద నివారణకు కృషి చేశారు. అంతేకాకుండా ప్రపంచంలోనే తొలిసారి జలాశయాలకు ఆటోమేటిక్గా వరద గేట్లు తెరిచే విధానాన్ని తీసుకొచ్చారు. ఇప్పటికీ ఈ విధానమే అమలులో ఉంది. ఆయన సేవలకు భారత రత్నతో సత్కరించిన కేంద్రం ఆయన జయంతిని ఇంజినీర్స్ డేగా నిర్వహిస్తోంది.