News April 5, 2024
BREAKING: వైసీపీకి ఎమ్మెల్సీ ఇక్బాల్ రాజీనామా

AP: ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ తన పదవికి రాజీనామా చేశారు. వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్‌ను కోరారు. అలాగే పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తూ సీఎం జగన్‌కు లేఖ రాశారు. ఇక్బాల్ TDPలో చేరనున్నట్లు సమాచారం. ఈయన 2019 ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం అక్కడ దీపికను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు.
Similar News
News January 21, 2026
హైదరాబాద్‌లోని NIRDPRలో 98 ఉద్యోగాలు

HYDలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్& పంచాయతీ రాజ్( NIRDPR)98 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. PG అర్హతతో పాటు పని అనుభవం గలవారు JAN 29 వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50. నెలకు Sr. కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.75K, కెపాసిటీ బిల్డింగ్ కన్సల్టెంట్‌కు రూ.60K చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: career.nirdpr.in/
News January 21, 2026
మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాసుకోవాలంటే..

హిందూ సంప్రదాయంలో పసుపుకు ప్రాధాన్యం ఎక్కువ. పసుపును ఆహారంలో వాడటంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కాళ్లకు పసుపు రాసుకుంటారు. దీనివెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పసుపుకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు గాయాలను మాన్పిస్తుంది. మహిళలు నీటిలో పనిచేయడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్ల నొప్పులు, వాపులను పసుపు నిరోధిస్తుంది.
News January 21, 2026
ఆ హీరోయిన్ ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఏజెంట్!

బాలీవుడ్ హీరోయిన్ రిమీ సేన్ రియల్ ఎస్టేట్ ఏజెంట్‌గా మారారు. సినిమా అవకాశాలు తగ్గాక దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. ‘ఇక్కడ 95% మంది ప్రవాసులే. రియల్ ఎస్టేట్ మార్కెట్లో క్రమశిక్షణ ఉంటుంది. ఏజెంట్లను ఆర్థిక సలహాదారులతో సమానంగా చూస్తారు. అదే ఇండియాలో 2నెలల బ్రోకరేజీ అడిగితే నేరం అన్నట్లుగా చూస్తారు’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. హిందీలో ధూమ్, హంగామా, గోల్‌మాల్‌తోపాటు తెలుగులో అందరివాడు మూవీలో ఆమె నటించారు.


