News February 24, 2026
BREAKING: MNCL: బాల్కసుమన్ కస్టడీ పిటిషన్ విచారణ వాయిదా

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కస్టడీ పిటిషన్ విచారణను ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఈనెల 26కు వాయిదా వేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు, సుమన్ తరఫు న్యాయవాదుల ప్రతివాదనలు విన్న తర్వాత విచారణ వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Similar News
News February 24, 2026
NRPT: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు: ఎస్పీ

జిల్లా వ్యాప్తంగా రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద వంద మీటర్ల వరకు 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు నారాయణపేట ఎస్పీ డాక్టర్ వినీత్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 15 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, పరీక్షలు జరిగే ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు ముసి ఉంచాలని చెప్పారు. విద్యార్థులు, సిబ్బంది ఎగ్జామ్ సెంటర్లోకి సెల్ ఫోన్లు తీసుకెళ్లరాదని సూచించారు.
News February 24, 2026
కాజీపేట షార్ట్ టర్మ్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

హన్మకొండ జిల్లా కాజీపేటలోని ప్రభుత్వ ఐటీఐ లో PMKVY 4.0 స్కీమ్ కింద ‘ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్’ తో పాటు ‘CNC ఆపరేటర్’ కోర్సుల్లో ఉచిత శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. మూడు నెలల శిక్షణ మార్చి 2, 2026 నుండి ప్రారంభం కానుంది. ఆసక్తి గల నిరుద్యోగ యువత దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు తెలిపారు.
News February 24, 2026
నాగర్‌కర్నూల్: ఇంటర్ పరీక్షల దృష్ట్యా ఎస్పీ కీలక ఆదేశాలు

జిల్లాలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షల నేపథ్యంలో ఎస్పీ సంగ్రామ్ జి పాటిల్ కీలక సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాల సమీపంలో జిరాక్స్ దుకాణాలు మూసివేయాలని, డీజేలు, లౌడ్ స్పీకర్ల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించారు. పరీక్షల నిర్వహణ దృష్ట్యా జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నలుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.


