News September 6, 2025
BREAKING: మోదీ అమెరికా పర్యటన రద్దు

న్యూయార్క్(US)లో ఈనెల 23 నుంచి 29 వరకు జరగనున్న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ హైలెవెల్ డిబేట్‌కు PM మోదీ హాజరుకావడం లేదు. ఇటీవల విడుదల చేసిన వివిధ దేశాధినేతల స్పీచ్ షెడ్యూల్ ప్రకారం ఈనెల 26న మోదీ UN జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాల్సి ఉంది. కానీ తాజాగా షెడ్యూల్ రివైజ్ అయింది. PM స్థానంలో విదేశాంగ మంత్రి జైశంకర్ ఈనెల 27న స్పీచ్ ఇవ్వనున్నారు. పర్యటన రద్దుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 6, 2025
పిల్లలకు ఫోన్ ఇస్తున్నారా? పెద్ద తప్పు చేస్తున్నారు!

పిల్లల ఏడుపును మాన్పించేందుకు, ఆహారం తినిపించేందుకు కొందరు వారికి ఫోన్ ఇస్తుంటారు. కొందరైతే తమ పిల్లలు సొంతగా యూట్యూబ్ వాడితే ఖుషీ అవుతుంటారు. కానీ పిల్లలకు ఫోన్ ఇవ్వడం మంచిది కాదని మానసిక వైద్యుడు శ్రీకాంత్ అంటున్నారు. ‘పిల్లల మెదడు ఎంత మొబైల్ చూస్తే అంత మొద్దుబారుతుంది. ఇంట్లో ఎన్ని తక్కువ బొమ్మలుంటే అంత చురుకవుతుంది. పేరెంట్స్ ఎన్ని మాటలు, కథలు చెప్తే అంత పదునవుతుంది’ అని తెలిపారు.
News September 6, 2025
కళ్లు అందంగా కనిపించాలంటే..

ఐ మేకప్ అనగానే కాటుక పెట్టుకోవడమే అనుకుంటారు చాలామంది. కాటుక అందాన్ని తెస్తుంది కానీ కళ్లు చిన్నగా కనిపించేలా చేస్తుంది. కళ్లు పెద్దగా కనిపించాలంటే తెలుపు, బ్రౌన్ కలర్ కాటుక ఎంచుకోవాలి. వీటిని కనుమూలల్లో సన్నగా రాస్తే కళ్లు పెద్దవిగా కనిపిస్తాయి. ఐ బ్రోస్ కూడా మరీ సన్నగా కాకుండా విల్లులా ఒంపు తిరిగినట్లుగా చేసుకుంటే కళ్లు పెద్దగా, అందంగా కనిపిస్తాయి. అలాగే లైట్ కలర్ ఐ లైనర్, మస్కారా కూడా వాడాలి.
News September 6, 2025
ఉద్యోగం చేస్తున్నారా? మీ హక్కులు తెలుసుకోండి

ప్రస్తుతకాలంలో ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది. అయితే వీరిలో చాలామందికి పని ప్రదేశంలో వారి హక్కుల గురించి తెలీదు. వీరికోసం సమానపనికి సమాన వేతనం, ప్రసూతి ప్రయోజనాల హక్కు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా POSH చట్టం, సురక్షిత పని ప్రదేశం వంటివి ఉన్నాయి. పెద్ద కంపెనీల నుంచి చిన్న షాపు వరకు ఇవన్నీ వర్తిస్తాయి. మహిళల గౌరవం, స్వేచ్ఛ, సమానత్వాన్ని కాపాడటానికి ఇవి ఉపకరిస్తాయి.