News December 13, 2024
క్షమాపణలు చెప్పిన మోహన్ బాబు

మీడియాపై దాడి ఘటనలో నటుడు మోహన్ బాబు TV9కి లిఖితపూర్వకంగా క్షమాపణలు తెలిపారు. ‘నా కుటుంబ ఘటన ఇలా పెద్దదిగా మారి టీవీ9ను, జర్నలిస్టులను ఆవేదనకు గురిచేసినందుకు చింతిస్తున్నాను. ఘటన అనంతరం 48 గంటల పాటు ఆస్పత్రిపాలు కావడం వల్ల వెంటనే స్పందించలేకపోయాను. ఆ రోజు ఆవేశంలో జరిగిన ఘటనలో జర్నలిస్టు గాయపడటం చాలా బాధాకరం. ఆయన కుటుంబానికి, టీవీ9కి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నాను’ అని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
బిహార్ ‘మహాగురు’.. MLAగా గెలవలేకపోయారు!

బిహార్ ఎన్నికల్లో ఉన్నత విద్యావంతుడు, టాప్ మ్యాథమెటీషియన్ కృష్ణ చంద్ర సిన్హా ఓడిపోవడంపై నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంత్ కిశోర్ స్థాపించిన JSP నుంచి పోటీ చేసిన ఈయనకు కేవలం 15వేల ఓట్లే వచ్చాయి. ఈయన బీఎస్సీ, ఎంఎస్సీలో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించారు. PhD పూర్తి చేశారు. గణితంపై 70 పుస్తకాలు రాశారు. బిహార్లో ఈయనను మహాగురు అని పిలుస్తారు. అయినా రాజకీయాల్లో రాణించలేకపోయారు.
News November 17, 2025
ఇవాళ ఈ మంత్రం జపిస్తే ‘అకాల మృత్యు భయం’ తొలగుతుంది!

కార్తీక సోమవారాలు శివారాధనకు అత్యంత ముఖ్యమైనవి. చివరి వారమైన ఈ రోజు ఉపవాసం ఉండి శివుడిని పూజిస్తే శుభకరమని పండితులు చెబుతున్నారు. మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తే శివానుగ్రహం లభించి, అకాల మృత్యు భయం తొలగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. నిష్ఠతో జపిస్తే శివుడు ఎల్లప్పుడూ కాపాడుతారని ప్రతీతి.
*‘ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం | ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్’*
News November 17, 2025
రష్యా నుంచి ఆయిల్ కొనే దేశాలపై 500% టారిఫ్!

రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాల కట్టడికి అమెరికా సెనేట్ కొత్త బిల్లు తెచ్చింది. అలాంటి దేశాలపై 500% టారిఫ్ విధించేలా తెచ్చే బిల్లును సెనేటర్ లిండ్సే ప్రతిపాదించారు. దీనికి ప్రెసిడెంట్ ట్రంప్ మద్దతిచ్చారు. దీంతో భారత్, చైనా లాంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించినట్లు సమాచారం.


