News December 10, 2024
BREAKING: మోహన్ బాబుకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు

TG: సినీ నటుడు మోహన్ బాబు అస్వస్థతకు గురయ్యారు. మరో కుమారుడు మంచు విష్ణుతో కలిసి గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. దీంతో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కాగా తన ఇంట్లో ఇవాళ సాయంత్రం నుంచి జరిగిన వరుస ఘటనల నేపథ్యంలో ఆయన టెన్షన్‌కు గురైనట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 9, 2025
నెలసరిలో నడుంనొప్పి ఎందుకు?

నెలసరిలో చాలామందికి నడుంనొప్పి వస్తుంది. నెలసరిలో ప్రోస్టాగ్లాండిన్స్ అనే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇవి గర్భాశయం లైనింగ్ తొలగించి, గర్భాశయ సంకోచాలను ప్రేరేపిస్తాయి. ఈ సంకోచాల కారణంగా నడుం కండరాలపై ప్రభావం చూపుతుంది. అలాగే ఎండోమెట్రియోసిస్ అనేది గర్భాశయం కణజాలంలో ఉంటుంది. ఇలా అసాధారణ కణజాల పెరుగుదల వల్ల నెలసరి సమయంలో నడుం నొప్పి వస్తుందని వైద్యులు చెబుతున్నారు.
News December 9, 2025
శంషాబాద్‌కు మరో బాంబు బెదిరింపు మెయిల్

TG: ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపు మెయిల్స్ ఆగడం లేదు. తాజాగా శంషాబాద్ విమానాశ్రయానికి మరో బెదిరింపు మెయిల్ వచ్చింది. అమెరికాకు వెళ్లే విమానంలో బాంబు ఉందని, పేలుడు జరగకుండా ఉండాలంటే మిలియన్ డాలర్లు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఎయిర్‌పోర్టు అంతటా క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మెయిల్ అమెరికాకు చెందిన జాస్పర్ పంపినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
News December 9, 2025
నేడు ‘తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్’ను ఆవిష్కరించనున్న సీఎం

TG: ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్‌లో సీఎం రేవంత్ ఇవాళ సాయంత్రం 6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనున్నారు. ఉదయం 9 నుంచి ప్యానెల్ డిస్కషన్స్ ప్రారంభం కానున్నాయి. అటు గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఇవాళ రాత్రి డ్రోన్ ప్రదర్శన చేయనున్నారు. నిన్న భారీ ఎత్తున పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోగా ఇవాళ మరిన్ని కంపెనీలతో అగ్రిమెంట్లు చేసుకునే అవకాశం ఉంది.


