News June 18, 2024

ఏపీలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు

image

AP: రాష్ట్రంలో YCP హయాంలో పెట్టిన అన్ని ప్రభుత్వ పథకాల పేర్లను టీడీపీ ప్రభుత్వం మార్చింది. మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ఆదేశాలతో అధికారులు ఉత్తర్వులిచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు-చంద్రన్న పెళ్లి కానుక, వైఎస్సార్ విద్యోన్నతి- ఎన్టీఆర్ విద్యోన్నతి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన- పోస్ట్ మెట్రిక్ స్కాలర్ షిప్, జగనన్న విదేశీ విద్యాదీవెన-అంబేడ్కర్ ఓవర్‌సీస్ విద్యా నిధిగా పేర్లు మార్చింది.

Similar News

News September 15, 2025

షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం బాధించింది: పాక్ కోచ్

image

మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్లు <<17712244>>షేక్ హ్యాండ్<<>> ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరుత్సాహపరిచిందని పాక్ కోచ్ మైక్ హెసన్ అన్నారు. వారి కోసం గ్రౌండ్‌లో తాము చాలాసేపు ఎదురుచూశామని, ఇది సరికాదని పేర్కొన్నారు. ఈ మ్యాచులో తమ ప్రదర్శన కూడా ఏమీ బాగోలేదని వ్యాఖ్యానించారు. కాగా నిన్న భారత ప్లేయర్స్ పాక్ ప్లేయర్లతో కరచాలనం చేయని విషయం తెలిసిందే. టాస్ టైమ్‌లోనూ పాక్ కెప్టెన్‌తో సూర్య చేతులు కలపలేదు.

News September 15, 2025

GSTని తగ్గించిన కేంద్రం.. ప్రీమియం పెంచేస్తున్న కంపెనీలు!

image

కేంద్రప్రభుత్వం బీమా ప్రీమియంపై జీఎస్టీని 18% నుంచి సున్నాకు తగ్గించినా ప్రజలకు ఆ మేర లబ్ధి చేకూరట్లేదు. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు 3 నుంచి 5 శాతం వరకు ప్రీమియాన్ని పెంచేశాయి. సెప్టెంబర్ 16 నుంచి కొత్త రేట్లు అమల్లోకి వస్తాయని తన కంపెనీ ప్రకటించినట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. దీంతో ప్రజలకు జీఎస్టీ తగ్గింపు పూర్తి ప్రయోజనాలు అందట్లేదు. అంతిమంగా 13% వరకే ఆదా కానున్నాయి.

News September 15, 2025

వెంటనే రూ.10వేల కోట్లు విడుదల చేయండి: సబిత

image

TG: విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారని BRS నేత సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. ‘ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు రాక ప్రైవేట్ కాలేజీలు మూతపడే పరిస్థితి ఉంది. దాదాపు 20 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటివరకు బకాయి పడ్డ రూ.10వేల కోట్ల నిధులు వెంటనే విడుదల చేయండి. మేము కరోనా సమయంలో ఒక్క రూపాయి ఆదాయం రాకపోయినా నిధులు ఆపలేదు’ అని ట్వీట్ చేశారు.