News February 4, 2025
పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు

TG: కాంగ్రెస్లో చేరిన BRS ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయి. వారిపై అనర్హతా వేటు వేయాలని BRS పార్టీ పిటిషన్ ఆధారంగా వివరణ ఇవ్వాలంటూ శాసనసభ కార్యదర్శి నోటీసులు పంపారు. వివరణ ఇచ్చేందుకు సమయం కావాలని MLAలు కోరారు. కాగా పార్టీ ఫిరాయింపుల పిటిషన్లపై విచారణ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శిపై <<15319239>>సుప్రీంకోర్టు <<>>ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసింది.
Similar News
News December 4, 2025
బాత్రూమ్లో ఎంతసేపు ఉంటున్నారు?

డీహైడ్రేషన్, సరైన ఆహారం తీసుకోకపోవడం, ఫైబర్ కొరత వల్ల మలబద్ధకం ఏర్పడుతుందని అందరూ అనుకుంటారు. టాయిలెట్ను ఆపుకోవడం, బాత్రూమ్లో ఎక్కువసేపు గడపడమూ మలబద్ధకానికి కారణమేనంటున్నారు గ్యాస్ట్రోఎంటరాలజిస్టులు. ‘పెద్దపేగు, పురీషనాళం అనుసరించే లయను విస్మరిస్తే మలం గట్టిగా మారుతుంది. ఫోన్ చూస్తూ 10 ని.ల కంటే ఎక్కువసేపు బాత్రూమ్లో కూర్చోవడం వల్ల మల రక్త నాళాలపై ఒత్తిడి పెరుగుతుంది’ అని పేర్కొంటున్నారు.
News December 4, 2025
మలబద్ధకాన్ని నివారించాలంటే?

* టాయిలెట్ వచ్చినప్పుడు వెంటనే వెళ్లాలి. రోజూ ఒకే సమయాన్ని అనుసరించాలి.
* సాధ్యమైనంత వరకు ఇండియన్ టాయిలెట్లను ఉపయోగించండి. వాటిని వాడటంలో సమస్యలుంటే వెస్ట్రన్ టాయిలెట్ల ముందు పీఠను ఉపయోగించి మోకాళ్లను కాస్త పైకి ఉంచుకోవాలి. ఇది మల మార్గాన్ని సులభతరం చేస్తుంది.
* 5-10 ని.ల కంటే ఎక్కువ సేపు బాత్రూమ్లో ఉండొద్దు.
* ఫుడ్లో తగినంత ఫైబర్, సరిపడినన్ని నీళ్లు తీసుకోవాలి. తేలికపాటి వ్యాయామాలు చేయాలి.
News December 4, 2025
పంచాయితీ చిచ్చు.. కుటుంబాలు ఛిన్నాభిన్నం

‘రూపాయి రూపాయి.. నువ్వు ఏం చేస్తావంటే హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను అని చెప్పిందట’ ఇది ఆ నలుగురు సినిమాలోని డైలాగ్. ఇప్పుడు రాజకీయమా నువ్వు ఏం చేస్తావంటే.. <<18468452>>తల్లీకూతుళ్లు<<>>, అన్నాచెల్లెళ్లు, తండ్రీకొడుకులు, బావ బావమరుదుల మధ్య చిచ్చు పెడతానని చెబుతుంది. TG పంచాయతీ ఎన్నికల్లో కనిపిస్తోన్న దృశ్యమిది. పార్టీలు, నాయకుల పంతాలతో సామాన్య కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతున్నాయి. ఈ ప్రమాదకర ధోరణిపై మీ కామెంట్


