News August 21, 2024

BREAKING: వైసీపీ కార్యాలయానికి నోటీసులు

image

AP: మంగళగిరిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి జరిగిన రోజు సీసీ ఫుటేజ్ సమర్పించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 2021 అక్టోబర్ 19న దాడి జరిగే ముందు వైసీపీ కార్యాలయం నుంచి ఎవరెవరు బయల్దేరారనే అంశంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇదే ఘటనకు సంబంధించి వైసీపీ నేత దేవినేని అవినాశ్‌కు పోలీసులు నోటీసులిచ్చారు.

Similar News

News December 8, 2025

చైనా మోడల్‌లో తెలంగాణ అభివృద్ధి: రేవంత్

image

TG: ‘తెలంగాణ రైజింగ్’ నిరంతర ప్రక్రియ అని, అందరి సహకారంతో లక్ష్యాలన్నిటినీ సాధించగలమన్న నమ్మకం ఉందని CM రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. చైనా గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ మోడల్‌లో TGని అభివృద్ధి చేస్తామని సమ్మిట్‌లో చెప్పారు. చైనా సహా జపాన్, జర్మనీ, సింగపూర్, సౌత్ కొరియా నుంచి ప్రేరణ పొందామని, వాటితో పోటీపడతామని వివరించారు. విజన్ కష్టంగా ఉన్నా సాధించే విషయంలో నిన్నటికంటే విశ్వాసంతో ఉన్నామని తెలిపారు.

News December 8, 2025

పెరిగిపోతున్న సోషల్ మీడియా ముప్పు

image

చర్మ సౌందర్యానికి సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలు నమ్మి చాలామంది మహిళలు సమస్యల్లో పడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. 20- 35 ఏళ్ల మధ్య ఉన్న మహిళల్లో 78% మంది ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో కనిపించే “మిరాకిల్ ట్రీట్మెంట్”ల నమ్మకంతో నకిలీ స్కిన్ సెంటర్లకు వెళ్తున్నారు. అక్కడ అనుభవం లేనివారితో ట్రీట్మెంట్లు చేయించుకొని చర్మానికి నష్టం కలిగించుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు.

News December 8, 2025

సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాం: సీఎం చంద్రబాబు

image

AP: వైసీపీ హయాంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని CM చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రాన్ని గాడిలో పెడతామన్న తమ మాటలను నమ్మి ప్రజలు కూటమికి అధికారం కట్టబెట్టారన్నారు. 18 నెలలుగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామని ప్రెస్‌మీట్‌లో చెప్పారు. సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చామని స్పష్టం చేశారు. పెట్టుబడి వ్యయాన్ని భారీగా పెంచగలిగామని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.