News April 9, 2024
BREAKING: 3,712 ఉద్యోగాలకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో 3,712 ఉద్యోగాల భర్తీకి CHSL(10+2) నోటిఫికేషన్‌ను SSC విడుదల చేసింది. మే 7న రా.11 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. లోయర్ డివిజినల్ క్లర్క్/జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులున్నాయి. ఆగస్టు 1, 2024 నాటికి 18-27 ఏళ్ల వయసు(రిజర్వేషన్ బట్టి సడలింపు), ఇంటర్ ఉత్తీర్ణులైన వారు అర్హులు. టైర్-1 పరీక్షలు జూన్, జులైలో ఉంటాయి.
వెబ్‌సైట్: ssc.gov.in
Similar News
News February 12, 2026
రాష్ట్రంలో 859 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

<
News February 12, 2026
ప్రైవేటు వర్సిటీల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్.. పొడిగింపు!

AP: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన స్టూడెంట్లకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2024-25, 2025-26కు వర్తింపజేసింది. ప్రైవేటు వర్సిటీల్లో 35% సీట్లు కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని చట్టంలో పేర్కొన్నా, ఫీజులపై స్పష్టతలేదు. దీంతో ప్రభుత్వం ఏటా ప్రత్యేకంగా జీవో ఇస్తోంది. కానీ జీవో జారీలో సమస్యతో స్టూడెంట్లకు ఫీజులు నిలిచిపోయాయి. తాజా ఆదేశాలతో విడుదలకానున్నాయి.
News February 12, 2026
ఓటు లైట్ తీసుకున్నారా?

TG: మున్సిపాలిటీ ఓటర్లు పోలింగ్ లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సగటున 82% పోలింగ్ నమోదవ్వగా మున్సిపాలిటీల్లో 73శాతమే నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో గ్రామీణ ఓటర్లే బాధ్యతగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పలు చోట్ల వృద్ధులు, విదేశాల నుంచి వచ్చి మరి ఓటేసిన ఘటనలు ఉన్నా మరికొందరు రాజ్యాంగం ఇచ్చిన హక్కును వినియోగించుకోవడంలో చైతన్యంగా కనిపించలేదు.


