News March 9, 2025
BREAKING: NRPT: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మరికల్ మండల కేంద్రంలోని భవాని దాబా దగ్గర శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు మరికల్ పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మరికల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మరికల్ ఎస్ఐ రామ తెలిపారు.
Similar News
News March 20, 2025
పర్యాటకులను మెప్పించేలా మరుగుదొడ్లు: కమిషనర్

వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర గురువారం నగరంలోని కేటీ రోడ్, జక్కంపూడి, వైవీఆర్ ఎస్టేట్స్, పాతపాడు, అయోధ్య నగర్ ప్రాంతాలను గురువారం పరిశీలించారు. పబ్లిక్ టాయిలెట్లు పర్యాటకులను ఆకర్షించేలా ఉండాలన్నారు. నూతన మరుగుదొడ్లు నిర్మించాలని అధికారులకు సూచించారు. మహిళల కోసం ప్రతి సర్కిల్లో పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలన్నారు. నిర్మాణంలో ఉన్న STP లు, రిజర్వాయర్లు, పిగ్ షెడ్ పనులను వేగంగా పూర్తిచేయాలని అన్నారు.
News March 20, 2025
వీరు షెఫ్‌లే.. కానీ ఆస్తులు తెలిస్తే షాకవ్వాల్సిందే

షెఫ్‌లే కదా అని వారిని తేలిగ్గా తీసిపారేయడానికి లేదు. వారి ఆస్తులు రూ.కోట్లలో ఉంటాయి మరి. ప్రకటనల్లో తరచూ కనబడే సంజీవ్ కపూర్ దేశంలోని షెఫ్‌లలో అత్యంత ధనవంతుడు. ఆయన ఆస్తి విలువ రూ.1165 కోట్లకు పైమాటే. ఇక ఆ తర్వాతి స్థానాల్లో వికాస్ ఖన్నా(సుమారు రూ.120 కోట్లు), రణ్‌వీర్ బ్రార్(రూ.41 కోట్లు), కునాల్ కపూర్ (రూ.43.57 కోట్లు), గరిమా అరోరా (రూ.40 కోట్లు), హర్‌పాల్ సింగ్ సోఖి(రూ.35 కోట్లు) ఉన్నారు.
News March 20, 2025
నాగర్ కర్నూల్: దివ్యాంగులకు యూనిక్ డిజబిలిటీ కార్డుపై అవగాహన సదస్సు

యూడీఐడీ కార్డుపైగా అవగాహన సదస్సును ఈరోజు డీఆర్డీఏ ఆధ్వర్యంలో జిల్లాలోని దివ్యాంగుల సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో నాగర్‌కర్నూల్ జిల్లా అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉపయోగపడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజశేఖర్, నిరంజన్, గణేశ్ కుమార్, బాల పీర్ తదితరులు పాల్గొన్నారు.