News March 9, 2025
BREAKING: NRPT: వాహనం ఢీకొని వ్యక్తి మృతి

మరికల్ మండల కేంద్రంలోని భవాని దాబా దగ్గర శనివారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందినట్లు మరికల్ పోలీసులు తెలిపారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో మరికల్ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు మరికల్ ఎస్ఐ రామ తెలిపారు.
Similar News
News December 14, 2025
నెల్లూరు: వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లో రైలు కింద పడి వ్యక్తి దుర్మరణం

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేదాయపాలెంలో ఆదివారం చోటు చేసుకుంది. నెల్లూరు నగరం వేదాయపాలెంలోని జనశక్తి నగర్‌కు చెందిన వొలిపి వెంకటేశ్వర్లు (63) జీవితంపై విరక్తి చెంది వేదాయపాళెం రైల్వే స్టేషన్‌లోని సౌత్ యార్డ్ వద్దకు వచ్చి రైలు కింద పడ్డాడు. మృతదేహం గుర్తు పట్టలేనంతగా నుజ్జునుజ్జు అయింది. రైల్వే ఎస్ఐ హరిచందన కేసు దర్యాప్తు చేస్తున్నారు.
News December 14, 2025
నిఘా వర్గాలతో నిరంతర పర్యవేక్షణ: SP

మహిళలు, విద్యార్థినుల భద్రతకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నట్లు SP వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శక్తి, ప్రత్యేక పోలీస్ బృందాలు, నిఘా వర్గాలతో నిరంతర పర్యవేక్షణ చేస్తున్నామని చెప్పారు. స్కూళ్లు, కాలేజీలు, జనసంచారం అధికంగా ఉండే ప్రాంతాలు, ప్రధాన రహదారులు, షాపింగ్ మాల్స్, మార్కెట్లు, సినిమా హాల్స్ , అపార్టుమెంట్లు, బస్టాండ్స్, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో పోలీసుల నిఘా ఉంటుందని చెప్పారు.
News December 14, 2025
సౌతాఫ్రికా ఆలౌట్.. భారత్ టార్గెట్ ఎంతంటే..?

భారత బౌలర్ల విజృంభణతో సౌతాఫ్రికా తక్కువ స్కోరుకే పరిమితమైంది. 117 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో మార్క్రమ్ (61) మినహా ఇంకెవరూ ప్రభావం చూపలేదు. ఫెరీరా 20, ఆన్రిచ్ నోర్జే 12 పరుగులు చేశారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, వరుణ్, అర్ష్‌దీప్, కుల్దీప్ తలో 2 వికెట్లు, హార్దిక్, దూబే చెరో వికెట్ తీశారు. భారత్ టార్గెట్ 118.


