News October 22, 2024

BREAKING.. NZB: పదవిని తిరస్కరించిన గడుగు గంగాధర్

image

తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన నిజామాబాద్ జిల్లాకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్‌ పదవిని తిరస్కరించారు. ఆయనను ఏడుగురు సభ్యుల్లో ఒక సభ్యుడిగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ అయినా తనను సభ్యుడిగా నియమించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో చర్చిస్తోంది.

Similar News

News November 5, 2024

NZB: మెడికల్ షాపులో చోరీకి పాల్పడ్డ దుండగులు

image

నిజామాబాద్ నగరంలోని ఖలీల్ వాడీ ప్రాంతంలో ఉన్న ఓ మెడికల్ షాప్‌లో దుండగులు చోరీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి బైక్‌పై వచ్చిన ముగ్గురు మెడికల్ షాప్‌ తాళం పగులగొట్టి లోనికి చొరబడి రూ.5 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. ఇది అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. వన్ టౌన్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News November 5, 2024

ఖతర్‌లో ముప్కాల్ వాసి గుండెపోటుతో మృతి

image

ముప్కాల్ మండల కేంద్రానికి చెందిన తాడూరి లింబాద్రి (58) గురువారం రోజు రాత్రి గుండెపోటుతో మరణించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మృతుడు గత కొన్ని సంవత్సరాలుగా దోహాలో ఉపాధి నిమిత్తం జీవనం కొనసాగిస్తున్నారు. మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

News November 5, 2024

కామారెడ్డి: రైలు దిగుతుండగా కిందపడి వ్యక్తి మృతి

image

రైలు దిగుతుండగా ప్రమాదవశాత్తు గాయపడిన ఓ వృద్ధుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు HYD కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపారు. కామారెడ్డికి చెందిన జీడి సిద్దయ్య (70) వికారాబాద్ నుంచి రైలులో వస్తు విద్యానగర్ రైల్వే స్టేషన్‌లో దిగుతుండగా కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.