News December 13, 2024
BREAKING: NZB: బాలికతో అసభ్య ప్రవర్తన.. కొట్టి చంపారు!
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలోని వీరన్నగుట్టలో ఓ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై ఆమె బంధువులు, స్థానికులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన అతడు చికిత్స పొందుతూ మృతిచెందగా శుక్రవారం ఉదయం గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు.
Similar News
News December 27, 2024
మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి టీపీసీసీ చీఫ్ నివాళులు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ నివాళులర్పించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఇతర ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీలోని మోతీలాల్ నెహ్రూ మార్గ్ వద్ద ఉన్న మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్న ఆయన మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మన్మోహన్ సింగ్ సతీమణిని పరామర్శించారు.
News December 27, 2024
కామారెడ్డి: UPDATE.. అనుమానంతో భార్య హత్య
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం అవుసులతండాలో మహిళను ఆమె <<14980915>>భర్త కత్తితో నరికి చంపిన<<>> విషయం తెలిసిందే. కాగా హత్యకు సంబంధించి వివరాలను ఎస్ఐ శివకుమార్ వెల్లడించారు. అవుసులతండాకు చెందిన మెగావత్ మోతిబాయి(55) పై ఆమె భర్త షేర్య కొంత కాలంగా అనుమానం పెంచుకున్నాడు. కాగా బుధవారం ఆగ్రహంతో భార్య మోతిబాయిని హత్య చేశాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
News December 27, 2024
మన్మోహన్ సింగ్ మృతి దేశానికి తీరని లోటు: టీపీసీసీ చీఫ్
మాజీ PM మన్మోహన్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి, పీఎంగా ఆయన చేసిన సేవలు దేశ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా నిలిచిపోతాయన్నారు. దేశాన్ని ఆర్థిక సంక్షోభాల నుంచి గట్టెక్కించి, అభివృద్ధి బాట పట్టించిన మహా ఆర్థిక మేధావి అని ‘X’ వేదికగా రాసుకొచ్చారు.