News September 23, 2025
BREAKING..NZB: గోడ కూలి తండ్రీకూతురి దుర్మరణం

కోటగిరిలో రైస్ మిల్లు గోడ కూలి తండ్రీకూతురు దుర్మరణం చెందారు. స్థానికుల వివరాలు.. మాలవాడకు చెందిన మహేశ్(25), అతని భార్య మహేశ్వరి, రెండు నెలల చిన్నారితో వారి ఇంట్లో నిద్రపోయారు. మంగళవారం ఉదయం ఇంటి పక్కనే ఉన్న పాడుబడ్డ రైస్‌మిల్ గోడ కూలి వారి ఇంటిపై పడింది. ఈ ఘటనలో మహేష్, రెండు నెలల చిన్నారి అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి వెంటనే మట్టిని తొలగించి మహేశ్వరిని ఆసుపత్రికి తరలించారు.
Similar News
News September 23, 2025
సూర్యాపేట: ప్రజావాణిలో 11 ఫిర్యాదులు

ప్రజా సమస్యల పరిష్కారంలో భాగంగా ఫిర్యాదులపై వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె.నరసింహ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 11 అర్జీలను ఆయన పరిశీలించారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సేవలు పొందాలని ఆయన సూచించారు.
News September 23, 2025
జూబ్లీహిల్స్ క్లాస్ అనుకుంటున్నారా.. ఊర మాస్!

జూబ్లీహిల్స్‌ను అంతా కాస్ట్‌లీ నియోజకవర్గమని పిలుస్తారు. విశాలమైన భవనాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లతో గ్రాండ్‌గా కనిపిస్తది. కానీ, జూబ్లీహిల్స్ MLAను ఎన్నుకునేది మాత్రం పేదలే అని ఎందరికి తెలుసు. అవును, నియోజవకర్గంలోని మెజార్టీ డివిజన్లు పక్కా మాస్. షేక్‌పేట, ఎర్రగడ్డ, బోరబండ, రహమత్‌నగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడలోని మధ్య తరగతి, పేదలే ఓట్లేస్తారు. ఇక్కడ అందమైన భవంతులే కాదు అంతకుమించి బస్తీలున్నాయి.
News September 23, 2025
వరంగల్: డిజిటల్ అరెస్టుల పేరుతో మోసాలకు లొంగొద్దు

డిజిటల్ అరెస్టుల పేరుతో ప్రజలను భయపెట్టి డబ్బు దోచుకునే మోసగాళ్లపై వరంగల్ పోలీసు శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. డిజిటల్ అరెస్ట్ అన్నది అసలే లేదు. మనీలాండరింగ్, డ్రగ్స్ పేరుతో ఎవరైనా బెదిరిస్తే నమ్మకండి అని పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి మోసపూరిత కాల్స్ వస్తే భయపడకుండా వెంటనే 1930 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. మీ భయమే వారి పెట్టుబడి-విజ్ఞతతో వ్యవహరించండి అన్నారు.