News October 22, 2024
BREAKING.. NZB: పదవిని తిరస్కరించిన గడుగు గంగాధర్

తెలంగాణ అగ్రికల్చర్, ఫార్మర్ వెల్ఫేర్ కమిషన్ సభ్యుడిగా నియమితులైన నిజామాబాద్ జిల్లాకు చెందిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్ పదవిని తిరస్కరించారు. ఆయనను ఏడుగురు సభ్యుల్లో ఒక సభ్యుడిగా నియమిస్తూ వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. సీనియర్ అయినా తనను సభ్యుడిగా నియమించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేయగా కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనతో చర్చిస్తోంది.
Similar News
News November 5, 2025
నిజామాబాద్: సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణలో తాహెర్ బిన్ హందాన్

తెలంగాణ ప్రభుత్వ ముఖ్య సలదారుడిగా నియమితులైన బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్ధూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్ పాల్గొన్నారు. సుదర్శన్ రెడ్డికి శాలువాతో సన్మానించారు. మరింత ఉన్నత స్థాయిలోకి ఎదగాలని ఆకాంక్షించారు. జిల్లా అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు.
News November 5, 2025
రాజకీయ పార్టీలకు బూత్ లెవల్ ఏజెంట్లు: నిజామాబాద్ కలెక్టర్

గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవెల్‌లో తమ ఏజెంట్లను నియమించుకోవాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. జిల్లా కార్యాలయంలో మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సన్నాహక ప్రక్రియలో భాగంగా 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత ఓటరు జాబితాను మ్యాపింగ్ చేస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
News November 4, 2025
NZB: తాగి వాహనాలు నడిపినందుకు జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ముగ్గురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగవారం తీర్పు వెల్లడించారని NZB ట్రాఫిక్ CI పబ్బ ప్రసాద్ తెలిపారు. గౌతమ్ నగర్‌కు చెందిన గుండ్ల శ్రీనివాస్, కోటగల్లీకి చెందిన కొమ్ము మధుకు 2 రోజుల చొప్పున, బోధన్‌కు చెందిన సురేందర్‌కు 3 రోజుల జైలు శిక్ష విధించారన్నారు. అలాగే 32 మందికి రూ.56,500 జరిమానా విధించినట్లు వివరించారు.


