News February 6, 2025

BREAKING: NZB: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధం

image

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ ఆటో దగ్ధమైన ఘటన నిజామాబాద్ నగరంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని ధర్మపురి హిల్స్‌కు చెందిన మొహమ్మద్ మొహియుద్దీన్ బుధవారం రాత్రి తన ఎలక్ట్రిక్ ఆటోను ఇంటి ఆవరణలో ఛార్జింగ్ పెట్టి ఇంట్లోకి వెళ్లాడు. గంట వ్యవధిలో ఒక్కసారిగా ఆటోలో నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఎలక్ట్రిక్ ఆటో పూర్తిగా దగ్ధమైంది.

Similar News

News February 6, 2025

BREAKING: మహబూబ్‌నగర్ జిల్లాలో MURDER

image

మహబూబ్‌నగర్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నందికొట్కూర్ వాసి షేక్ అబ్దుల్ రహమాన్ కూతురిని అదే గ్రామానికి చెందిన అలీ ఖాన్(36) తరచూ వేధిస్తున్నాడు. ఈక్రమంలో చిన్నచింతకుంట మండలం తిరుమలాపూర్‌‌లో ఈరోజు కూడా మళ్లీ ఆమెను వేధించసాగాడు. విషయం తెలుసుకున్న అబ్దుల్ రహమాన్ తన కూతురిని వేధిస్తావా అంటూ అలీని రాడ్డుతో కొట్టి చంపేశాడు. పోలీసులు వచ్చి మృతదేహాన్ని తరలించారు.

News February 6, 2025

బీజేపీకి 45-55 సీట్లు: యాక్సిస్ మై ఇండియా

image

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను వెల్లడించింది. బీజేపీ 45-55, ఆప్ 15-25, కాంగ్రెస్ 0-1, ఇతరులు 0-1 సీట్లు గెలుస్తాయని పేర్కొంది. 70 అసెంబ్లీ సీట్లున్న ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 36 సీట్లు అవసరం.

News February 6, 2025

₹61,500 బదులు ₹10,000 Income Tax చెల్లిస్తే చాలు..

image

₹12L వరకు ట్యాక్స్ లేదు. దానిపై జస్ట్ ₹10వేలు పెరిగితే, అంటే ₹12.10L అయితే ₹61,500 పన్ను చెల్లించాలేమోనని కొందరు కంగారు పడుతున్నారు. వీరికి సెక్షన్ 87A ప్రకారం మార్జినల్ రిలీఫ్ ఉంటుంది. మొత్తం పన్ను (61,500)లో పెరిగిన శాలరీ (10000)ని తీసేయగా మిగిలిన మొత్తం రిబేట్‌‌ (51,500) వస్తుంది. దానిని ₹61,500 నుంచి తీసేస్తే మిగిలిన ₹10000 మాత్రమే పన్నుగా చెల్లించాలి. ఇలా ₹51,500 ఆదా చేసుకోవచ్చు. Share It.

error: Content is protected !!