News August 13, 2024
BREAKING.. NZB: పోలీస్ స్టేషన్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోని ఎస్సై గదిలో ఎస్సై లేని సమయంలో రమేశ్ అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కాసేపటికి ఈ విషయాన్ని గుర్తించిన సిబ్బంది హుటాహుటిన అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సూసైడ్ అటెంప్ట్కు గల కారణాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వ్యక్తి ఎస్సై ఛాంబర్లోకి వెళ్లి అఘాయిత్యానికి పాల్పడినా అక్కడి సిబ్బంది పట్టించుకొకపోవడం గమనార్హం.
Similar News
News January 15, 2025
కనుమ ఎఫెక్ట్.. మటన్, చికెన్ షాపుల వద్ద ఫుల్ రష్
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కనుమ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. మొన్న భోగి, నిన్న సంక్రాంతి జరుపుకున్న ప్రజలు నేడు మందు, మటన్, చికెన్ ముక్క వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో మటన్, చికెన్ షాపులకు రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే షాపుల వద్ద నాన్ వెజ్ ప్రియులు బారులు తీరారు. దీంతో షాపులు పూర్తిగా రద్దీగా మారాయి. అటు నాటు కోళ్ల కు కూడా భారీగా డిమాండ్ పెరిగింది.
News January 15, 2025
NZB: కేటీఆర్ జైలుకు వెళ్తారు: ఎంపీ అర్వింద్
తెలంగాణాలో BRS భూస్థాపితం కాబోతోందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవిత ఇప్పటికే జైలుకు వెళ్లి వచ్చారని, ఇప్పుడు కేటీఆర్ సైతం జైలుకు వెళ్తారని జోస్యం చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే ఏదో సాధించామని మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత KCR ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పడుకున్నారని ఎద్దేవా చేశారు.