News December 27, 2024
రేపు ఒకపూట సెలవు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి సంతాపంగా కేంద్ర క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం ఒకపూట సెలవు ఇస్తున్నట్లు ప్రకటించింది. దేశంలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ సెలవు వర్తించనుంది. ఇప్పటికే 7 రోజుల పాటు సంతాప దినాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కాగా తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు ఇవాళ సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News December 28, 2024
నవంబర్‌లో శ్రీవారి హుండీకి రూ.111.3 కోట్లు
AP: నవంబర్ నెలలో తిరుమల శ్రీవారిని 20.35 లక్షల మంది భక్తులు దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. అదే సమయంలో హుండీ కానుకలు రూ.111.3 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు. 7.31 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు. నెల రోజుల్లో 97.01 లక్షల లడ్డూలు విక్రయించగా 19.74 లక్షల మంది భక్తులు అన్నప్రసాదం స్వీకరించినట్లు పేర్కొన్నారు.
News December 28, 2024
మన్మోహన్‌కు స్మారకమా? మరి నా తండ్రికెందుకు అడగలేదు: ప్రణబ్ కుమార్తె
మన్మోహన్ సింగ్ ప్రత్యేక స్మారకం కోసం PM మోదీని ఖర్గే కోరడాన్ని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్ఠ విమర్శించారు. పార్టీకి సేవలందించి, రాష్ట్రపతిగా పనిచేసిన తన తండ్రి చనిపోతే వాళ్లు స్మారకమే అడగలేదన్నారు. కనీసం CWC మీటింగ్ పెట్టి సంతాపం ప్రకటించలేదని ఆరోపించారు. ఇవన్నీ ప్రధానులకే అని ఒకరు చెప్పగా KR నారాయణన్‌కు CWC సంతాపం ప్రకటించడాన్ని తన తండ్రి డైరీస్ ద్వారా తెలుసుకున్నానని గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
News December 28, 2024
సంక్రాంతికి ఇంటికెళ్లేవారికి GOOD NEWS
సంక్రాంతికి HYD నుంచి APకి వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ప్రకటించింది. JAN 9 నుంచి 13 మధ్య ఇవి అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ ప్రత్యేక బస్సుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని, అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని పేర్కొంది. MGBSలో రద్దీని తగ్గించేందుకు JAN 10-12 మధ్య కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే బస్సులను CBS గౌలిగూడ నుంచి నడిపిస్తామంది.