News July 10, 2025

BREAKING: పంత్‌కు గాయం

image

ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ సందర్భంగా భారత్ వికెట్ కీపర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. కీపింగ్ చేస్తుండగా బంతి అతడి వేలుకి బలంగా తాకింది. దీంతో ఫిజియో వచ్చి పంత్ వేలికి ట్రీట్‌మెంట్ చేసినా నొప్పి తగ్గలేదు. మెరుగైన చికిత్స కోసం అతడు మైదానాన్ని వీడారు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ కీపింగ్ చేస్తున్నారు. గాయం పెద్దదై పంత్ బ్యాటింగ్ చేయలేకపోతే టీమ్ ఇండియాకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది.

Similar News

News August 15, 2025

బుమ్రాను ముఖ్యమైన మ్యాచుల్లోనే ఆడించాలి: భువనేశ్వర్

image

వర్క్‌లోడ్ విషయంలో బుమ్రాకు భువనేశ్వర్ మద్దతుగా నిలిచారు. ENG‌తో 5 టెస్టుల సిరీస్‌లో బుమ్రా మూడింట్లో మాత్రమే ఆడటంతో అతని పట్ల BCCI పక్షపాతం చూపిస్తోందన్న విమర్శలొచ్చాయి. దీనిపై భువి స్పందిస్తూ ‘ఏళ్ల పాటు అన్ని ఫార్మాట్లలో ఆడుతూ ఫిట్‌గా ఉండటం కష్టం. అతడు ఏం చేయగలడో సెలక్టర్లకు తెలుసు. బుమ్రా ఎక్కువ కాలం ఆడాలని కోరుకుంటే అతడిని IMP మ్యాచుల్లోనే ఆడించాలి’ అని అభిప్రాయపడ్డారు.

News August 15, 2025

తెలంగాణ డీజీపీ జితేందర్ తల్లి కన్నుమూత

image

తెలంగాణ డీజీపీ జితేందర్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి కృష్ణ గోయల్ (85) కన్నుమూశారు. అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి. ఆమె మృతి పట్ల రాజకీయ నేతలు, పోలీస్ అధికారులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

News August 15, 2025

శిథిలాల కింద 500 మంది ఉండొచ్చు: ఫరూక్ అబ్దుల్లా

image

జమ్మూకశ్మీర్ కిష్త్వార్‌లో భారీ వరదల వల్ల 60మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే. అయితే, శిథిలాల కింద 500 మంది వరకు చిక్కుకొని ఉంటారని నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. అయితే ఆ సంఖ్య వెయ్యికి పైగా ఉంటుందని పలువురు అధికారులు చెబుతున్నట్లు వివరించారు. ఇదో విషాదకర ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు. మృతులకు ఆయన సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.