News December 7, 2024
BREAKING: తెలంగాణ తల్లి విగ్రహంపై హైకోర్టులో పిటిషన్

TG: తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సచివాలయంలో విగ్రహ ప్రతిష్ఠను నిలిపివేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ ఛైర్మన్ జూలూరి గౌరీ శంకర్ కోరారు. త్వరలోనే ఈ పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేయనుంది. ఈ విగ్రహంపై బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
Similar News
News February 4, 2026
వాట్సాప్‌పై సుప్రీం ఆగ్రహం.. అసలు ఏం జరిగింది?

వాట్సాప్‌కు <<19037669>>సుప్రీంకోర్టు<<>> గట్టి వార్నింగ్ ఇచ్చింది. అసలు మ్యాటర్ ఏంటంటే.. 2021లో వాట్సాప్ తెచ్చిన ప్రైవసీ పాలసీ ప్రకారం యూజర్ల డేటాను మెటాలోని ఇతర కంపెనీలతో షేర్ చేసుకుంటామని చెప్పింది. దీనికి అంగీకరిస్తేనే వాట్సాప్ వాడుకోనిస్తాం, లేదంటే అకౌంట్ డిలీట్ చేసుకోండని కండిషన్ పెట్టింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు..‘భారత రాజ్యాంగాన్ని గౌరవించకపోతే దేశం విడిచి వెళ్లిపోండి’ అని హెచ్చరించింది.
News February 4, 2026
ఫిబ్రవరి 04: చరిత్రలో ఈరోజు

☛ 1891: స్వాతంత్ర్య సమర యోధుడు, లోక్‌సభ మాజీ స్పీకర్ మాడభూషి అనంతశయనం అయ్యంగార్ జననం
☛ 1962: సినీ నటుడు రాజశేఖర్ జననం
☛ 1972: దర్శకుడు శేఖర్ కమ్ముల జననం
☛ 1974: సినీ నటి, పొలిటీషియన్ ఊర్మిళ జననం
☛ 2023: సింగర్ వాణి జయరాం మరణం(ఫొటోలో)
☛ వరల్డ్ క్యాన్సర్ డే
☛ శ్రీలంక స్వాతంత్ర్య దినోత్సవం
News February 4, 2026
స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం: చంద్రబాబు

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ప్లాంట్ పురోగతిపై ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కొత్త విధానాలతో అన్ని విభాగాల్లో కర్మాగారాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. మరోవైపు 2024 సెప్టెంబర్‌లో ఎదుర్కొన్న రూ.486 కోట్ల నష్టాల నుంచి గట్టెక్కి.. 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని స్టీల్ ప్లాంట్ సాధించింది.


