News June 6, 2024
BREAKING: పిన్నెల్లికి హైకోర్టులో ఊరట

AP: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఈవీఎంల ధ్వంసం సహా 4 కేసుల్లో మధ్యంతర ముందస్తు బెయిల్‌ను పొడిగించింది. వారంపాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. ఈ కేసులపై గురువారం తదుపరి విచారణ చేస్తామని తెలిపింది. కాగా పిన్నెల్లిని ఇవాళ అరెస్టు చేస్తారని ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News January 27, 2026
పొడిబారిన జుట్టుకు పంప్కిన్ మాస్క్

తేమ కోల్పోయి నిర్జీవమైన జుట్టును తిరిగి పూర్వపు స్థితికి తీసుకురావాలంటే గుమ్మడికాయ హెయిర్ ప్యాక్ పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎర్ర గుమ్మడి కాయ ముక్కల్లో కాస్త తేనె వేసి పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకోవాలి. 3 గంటల తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు పట్టులా మృదువుగా మారుతుంది.
News January 27, 2026
మేడారం జాతరకు సెలవులు ఇవ్వాలని డిమాండ్లు

TG: రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మేడారం మహాజాతరకు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. దీంతో స్కూళ్లకు సెలవులు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ప్రభుత్వమే ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న జాతర నేపథ్యంలో హాలిడేస్ ప్రకటించాలని పేరెంట్స్ అంటున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఇవాళో, రేపో ఏదైనా నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
News January 27, 2026
పాపాలను పోగొట్టే తిరుమల తీర్థం.. మీరు వెళ్తున్నారా?

తిరుమల కొండల్లోని పవిత్ర రామకృష్ణ తీర్థానికి వెళ్లే అద్భుత అవకాశాన్ని TTD కల్పిస్తోంది. ఏడాదికి ఒక్కసారి(మాఘ పౌర్ణమి) మాత్రమే ఇక్కడికి వెళ్లే అనుమతి ఉంటుంది. ఆ పుణ్య ఘడియలు ఈ ఏడాది FEB 1న రాబోతున్నాయి. ఈ తీర్థంలో స్నానమాచరిస్తే జన్మజన్మల పాపాలు తొలగి మోక్షం లభిస్తుందని నమ్మకం. మహావిష్ణువు రామకృష్ణుడనే సాధువుకు ముక్తినిచ్చిన పుణ్య ప్రదేశమిది. ఎలా వెళ్లాలో పూర్తి వివరాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


