News March 21, 2025
BREAKING: పోసానికి బెయిల్ మంజూరు

AP: సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో సినీనటుడు పోసాని కృష్ణమురళికి గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. CID కేసులో ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. త్వరలో ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పోసాని 5 కేసుల్లో అరెస్ట్ అవగా అన్ని కేసుల్లోనూ బెయిల్ లభించింది.
Similar News
News December 31, 2025
నా కూతురికి యాక్టర్ కావాలని లేదు: రోజా

తన కూతురు అన్షు భవిష్యత్తుపై నటి, మాజీ మంత్రి రోజా క్లారిటీ ఇచ్చారు. ‘అన్షుకు యాక్టర్ కావాలనే కోరిక లేదు, సైంటిస్ట్ కావాలనుకుంటోంది. అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ పరిశోధనలపై దృష్టి సారించింది. పిల్లలకు భవిష్యత్తును నిర్ణయించుకునే విషయంలో స్వేచ్ఛను ఇచ్చాను’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. స్టార్ హీరో కొడుకుతో అన్షు పెళ్లిపై స్పందిస్తూ.. ‘ఆ హీరో ఎవరో చెబితే తెలుసుకుంటా’ అని నవ్వుతూ జవాబిచ్చారు.
News December 31, 2025
టెన్త్ అర్హతతో 25,487పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

కేంద్ర బలగాల్లో <
News December 31, 2025
జనవరి 2 నుంచి పట్టాదారు పుస్తకాల పంపిణీ

AP: రాష్ట్రవ్యాప్తంగా జనవరి 2 నుంచి 9వ తేదీ వరకు 21.80 లక్షల పట్టాదారు పాస్‌పుస్తకాలను పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ రాజముద్రతో కొత్తగా ముద్రించిన ఈ పాస్‌పుస్తకాలను రైతులకు అందించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏమైనా తప్పులు గుర్తిస్తే సరిదిద్దుకునే అవకాశం కల్పించనున్నారు. ఊరూరా రెవెన్యూ గ్రామసభల ద్వారా పంపిణీ జరగనుంది. ఇటీవల కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు తేదీలను ఖరారు చేశారు.


