News April 6, 2025
BREAKING: వక్ఫ్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం

వక్ఫ్ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. ఉభయ సభలూ ఇటీవల బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే. ఆ బిల్లుకు రాష్ట్రపతి ముర్ము కాసేపటి క్రితం ఆమోదం తెలిపారు. దీంతో వక్ఫ్ సవరణలు ఇక చట్టరూపంలో అమలుకానున్నాయి. వక్ఫ్ బోర్డులకున్న అధికారాలను తగ్గించి పేద ముస్లింలకు న్యాయం చేస్తున్నామని కేంద్రం చెబుతుండగా.. ఆ సవరణలు తమ మతానికి వ్యతిరేకమని ముస్లిం వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Similar News
News November 23, 2025
రెండో టెస్టు.. దక్షిణాఫ్రికా ఆలౌట్

గువాహటిలో జరుగుతున్న రెండో టెస్టులో ఎట్టకేలకు దక్షిణాఫ్రికా 489 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలర్లకు కొరకరాని కొయ్యలా మారిన ముత్తుస్వామి (109) శతకం బాదారు. జాన్సెన్ (93) త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నారు. టీమ్ ఇండియా బౌలర్లలో కుల్దీప్ 4, జడేజా, సిరాజ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. టీమ్ఇండియా తన తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది.
News November 23, 2025
అవసరమైతే తిరిగి రాజకీయాల్లోకి వస్తా: VSR

AP: తనకు వేరే రాజకీయ పార్టీ పెట్టే ఉద్దేశం లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి(VSR) అన్నారు. ప్రస్తుతానికి తాను రైతు మాత్రమేనని చెప్పారు. ఇతర పార్టీల్లోనూ చేరే ఉద్దేశమూ లేదని పేర్కొన్నారు. అవసరం వస్తే మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని తెలిపారు. జగన్ చుట్టూ ఉన్న కోటరీ ఆయనను డైవర్ట్ చేస్తోందన్నారు. అందుకే తాను రాజకీయాలకు దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిబద్ధత లేని వారి మాటలు జగన్ వినకూడదని సూచించారు.
News November 23, 2025
ఇంధన పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు

AP: ఇంధన సామర్థ్యం/పొదుపుపై షార్ట్ వీడియో పోటీలు నిర్వహిస్తున్నట్లు జెన్కో MD నాగలక్ష్మి వెల్లడించారు. 8, 9, 10 తరగతుల విద్యార్థులు పోటీకి అర్హులని తెలిపారు. ‘తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో 30-120సెకన్ల నిడివితో MP4 ఫార్మాట్లో వీడియోలు రూపొందించి DEC 10లోగా పంపాలి. తొలి 3 స్థానాల్లో నిలిచిన వారికి ₹20K, ₹10K, ₹5K బహుమతులు ఇస్తాం. వివరాలకు 0866-2457620 నంబరులో సంప్రదించాలి’ అని చెప్పారు.


