News June 4, 2024

BREAKING: ప్రధాని మోదీ ఘన విజయం

image

సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ ఘన విజయం సాధించారు. వారణాసి నుంచి పోటీ చేసిన ఆయన సమీప అభ్యర్థి అజయ్ రాయ్(కాంగ్రెస్)పై 1.50 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. మోదీకి 6,12,970 ఓట్లు పడ్డాయి. ఆయన వారణాసిలో గెలవడం ఇది వరుసగా మూడోసారి.

Similar News

News January 15, 2026

అంటురోగాల వ్యాప్తిని గుర్తించేందుకు వెబ్‌లింక్

image

AP: అపరిశుభ్రత, కలుషిత తాగునీటితో వాంతులు, విరేచనాల వంటి అంటురోగాలు ప్రబలుతుంటాయి. వీటిపై స్థానిక సిబ్బందికి, వారినుంచి పై స్థాయికి సమాచారం చేరడంలో జాప్యంతో సమస్య జటిలం అవుతోంది. దీని నివారణ కోసం ప్రజలను భాగస్వాములను చేసేలా వైద్యశాఖ IHIP వెబ్ లింక్‌ను ఏర్పాటుచేసింది. అంటురోగాల సమాచారాన్ని ఫొటోలతో సహా వారు అందులో పొందుపర్చవచ్చు. మరిన్ని వివరాలకు <>క్లిక్<<>> చేయండి.

News January 15, 2026

మిచెల్.. టీమ్ ఇండియా అంటే చాలు..

image

న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ మిచెల్ టీమ్ ఇండియా అంటే చాలు శివాలెత్తుతున్నారు. వన్డేల్లో ఇండియాపై 10 ఇన్నింగ్సుల్లో 3 సెంచరీలతో 600కు పైగా రన్స్ చేశారు. 5 సార్లు 50కి పైగా పరుగులు చేశారు. సగటు 66.66గా ఉండటం విశేషం. 2023 ప్రపంచకప్ సెమీ ఫైనల్లోనూ భారత్‌పై 134 పరుగులు చేశారు. లీగ్ మ్యాచులో 130 రన్స్‌తో చెలరేగారు. ప్రస్తుతం ICC వన్డే ర్యాంకింగ్స్‌లో మిచెల్ రెండో స్థానంలో ఉన్నారు.

News January 15, 2026

జనవరి 15: చరిత్రలో ఈరోజు

image

✭ 1887: సంఘసంస్కర్త త్రిపురనేని రామస్వామి జననం
✭ 1929: ఆఫ్రికన్-అమెరికన్ పౌరహక్కుల ఉద్యమకారుడు మార్టిన్ లూథర్ కింగ్ జననం
✭ 1956: BSP చీఫ్ మాయావతి జననం
✭ 1967: సినీ నటి భానుప్రియ జననం
✭ 1991: సినీ నటుడు రాహుల్ రామకృష్ణ జననం
✭ భారత సైనిక దినోత్సవం