News April 4, 2024
BREAKING: పంజాబ్ టార్గెట్ 200 రన్స్

పంజాబ్తో మ్యాచులో గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి 199 రన్స్ చేసింది. కెప్టెన్ గిల్ 89* పరుగులతో అదరగొట్టగా, సాయి సుదర్శన్ 33, విలియమ్సన్ 26, సాహా 11, విజయ్ శంకర్ 8, తెవాటియా 23* రన్స్ చేశారు. రబడ 2 వికెట్లు, హర్ప్రీత్ బార్, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీశారు. విజయం కోసం పంజాబ్ 200 పరుగులు చేయాలి.
Similar News
News January 18, 2026
4రోజుల్లో రూ.82కోట్లు కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలై 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ‘సంక్రాంతి రారాజు బాక్సాఫీస్ ధమాకా పేలుతూనే ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టింది. మీనాక్షీ చౌదరి హీరోయిన్గా నటించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు.
News January 18, 2026
ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

<
News January 18, 2026
2026 దావోస్ సమ్మిట్ థీమ్ ఇదే!

‘ఎ స్పిరిట్ ఆఫ్ డైలాగ్’ థీమ్తో 2026 దావోస్ సమ్మిట్ జరగనుంది. ప్రపంచంతో పోటీ పడేందుకు అవసరమైన సహకారం, ఆవిష్కరణలు, స్థిరమైన వృద్ధిపై ప్రధానంగా చర్చిస్తారు. ప్రతి ఏడాది JANలో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సమావేశాలను 1971లో జర్మన్ ఎకనామిక్ సైంటిస్ట్ ప్రొఫెసర్ క్లాస్ ష్వాబ్ స్టార్ట్ చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలు, పరిష్కారాలపై చర్చకు వేదికగా సమ్మిట్ నిర్వహిస్తున్నారు.


