News July 18, 2024
BREAKING: తెరుచుకున్న పూరీ రహస్య గది

ఒడిశాలోని పూరీ రత్న భాండాగారంలోని రహస్య గదిని అధికారులు తెరిచారు. ఆలయంలోని సంపదను స్ట్రాంగ్ రూమ్కు తరలించనున్నారు. ఇప్పటికే రెండు గదుల్లోని సంపదను తరలించారు. ఈ నెల 14న రహస్య గదిని తెరిచినా అప్పటికే సాయంత్రం కావడంతో సీల్ వేశారు. ఈ క్రమంలో ఆలయంలోకి భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. రహస్య గదిలో దిగువన సొరంగ మార్గం ఉందా? లేదా? అనే దానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Similar News
News December 6, 2025
వంటింటి చిట్కాలు

*వెల్లుల్లిపాయ పొట్టు త్వరగా రావాలంటే.. వాటిని పెనం మీద వేసి కొద్దిసేపు వేడి చేయాలి. ఇలా చేస్తే పొట్టు ఈజీగా వస్తుంది.
*కర్రీలో పులుపు మరీ ఎక్కువగా ఉంటే బెల్లం లేదా ఉప్పు కలిపి చూడండి. ఇక్కడ ఉప్పును రుచి చూసి కలుపుకోవాలి.
* కాకరకాయ కూర వండేటప్పుడు కాస్త నిమ్మరసం వేస్తే చేదు తగ్గుతుంది.
* పకోడీలు కరకరలాడుతూ రావాలంటే పిండి కలిపేటప్పుడే ఒక చెంచా మరుగుతున్న నూనె కలపాలి.
News December 6, 2025
7వేల కి.మీ పొడవైన నది.. కానీ బ్రిడ్జిలు ఉండవు!

ప్రపంచంలోనే అతిపెద్దదైన అమెజాన్ నదిపై వంతెనలు లేవని మీకు తెలుసా? అవును. ఈ నది బ్రెజిల్, పెరూ, ఈక్వెడార్, కొలంబియా, బొలివియా, వెనిజులా, గయానా, సురినామ్ దేశాల మీదుగా దాదాపు 7వేల కి.మీ ప్రవహిస్తుంది. దీని వెడల్పు 3-10 కి.మీ ఉంటుంది. వర్షాకాలంలో అది 48 కి.మీ వరకు విస్తరిస్తుంది. లోతు 330 అడుగులకు చేరుతుంది. అంతేకాదు అక్కడి మృదువైన నేలల్లో బ్రిడ్జిలు నిర్మించడం చాలా కష్టం. అందుకే బోట్లలో నది దాటుతారు.
News December 6, 2025
‘కింగ్’ కోహ్లీ హ్యాట్రిక్ సెంచరీ చేస్తారా?

విశాఖ వేదికగా IND-SA మధ్య ఇవాళ నిర్ణయాత్మక మూడో వన్డే జరగనుంది. ఈ మ్యాచ్లో అందరి దృష్టి కోహ్లీపైనే ఉంది. ఇప్పటికే ఈ సిరీస్లో వరుసగా రెండు సెంచరీలు చేసిన విరాట్.. ఈరోజు సెంచరీ చేసి హ్యాట్రిక్ సాధిస్తారా? అనే ఉత్కంఠ నెలకొంది. విశాఖ పిచ్పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు (7 మ్యాచ్ల్లో 3 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు) ఉంది. చిన్న బౌండరీలు కూడా అనుకూలంగా మారనున్నాయి. అన్నీ కలిసొస్తే మరో సెంచరీ ఖాయం.


